అమ్మ సెంటిమెంట్ తో మోడీకి బ్యాచ్ కు పంచ్‌

Update: 2018-05-28 07:29 GMT
మోడీ బ్యాచ్ కు అనుకోని రీతిలో షాకిచ్చారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌పై త‌ర‌చూ త‌ప్పు ప‌ట్టే మోడీ బ్యాచ్ కు ఆయ‌న ఊహించ‌ని రీతిలో కౌంట‌ర్ ఇచ్చారు. వివ‌రాలు ఏమీ చెప్పాపెట్ట‌కుండా విదేశాల‌కువెళ్లి రావ‌టం.. ఎక్క‌డికి వెళ్లింది?  ఎవ‌రిని క‌లిసింది రాహుల్ చెప్ప‌ట్లేదంటూ ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు త‌ర‌చూ త‌ప్పు ప‌డుతుంటారు.

తాజాగా అలాంటి తీరుకు చెక్ పెట్టారు రాహుల్‌. త్వ‌ర‌లో విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్న రాహుల్‌.. త‌న ప‌ర్య‌ట‌న వెనుక‌నున్న విష‌యాన్ని వివ‌రిస్తూ.. త‌న త‌ల్లికి వార్షిక వైద్య ప‌రీక్ష‌ల కోసం తాను తోడుగా విదేశాల‌కు వెళుతున్న‌ట్లు చెప్పారు. "వార్షిక వైద్య ప‌రీక్ష‌ల కోసం అమ్మ‌ను ఆసుప‌త్రికి తీసుకెళుతున్నాను. కొద్ది రోజులు అందుబాటులో ఉండ‌ను. ఈ సంద‌ర్భంగా బీజేపీ ట్రోలింగ్ ఆర్మీకి ఒక సూచ‌న‌. న‌న్ను విమ‌ర్శించ‌టానికి ఎక్కువ క‌స‌ర‌త్తు చేయాల్సిన అవ‌స‌రం లేదు. త్వ‌ర‌లోనే తిరిగి వ‌స్తా." అంటూ వ్యాఖ్యానించారు.

విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన వెంట‌నే రాహుల్ ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో హాజ‌ర‌య్యేందుకు షెడ్యూల్ ను ఖ‌రారు చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని మాంద్ సౌర్ రైతుల‌పై కాల్పుల ఘ‌ట‌న‌కు ఏడాది పూర్తి కావొస్తున్న సంద‌ర్భంలో రాహుల్ ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించ‌న‌న్నారు. మ‌రికొద్ది నెలల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న వేళ‌.. బీజేపీ స‌ర్కారును ఇరుకున పెట్టేలా మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌కు కాంగ్రెస్ నాయ‌క‌త్వం ప్లాన్ చేస్తోంది.


Tags:    

Similar News