తనపై కేసులు గర్వకారణమన్న రాహుల్ గాంధీ!

Update: 2019-12-05 10:10 GMT
తనపై కేసులు గర్వకారణం అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ. కేరళలో పర్యటిస్తున్న ఈ ఎంపీ ఈ ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా రాహుల్ పై రకరకాల కేసులు నమోదు అయ్యాయి. భారతీయ జనతా పార్టీ వాళ్లపై చేసిన ఆరోపణలు - వారిపై చేసిన వ్యాఖ్యల ఫలితంగా రాహుల్ పై వివిధ కేసులు వచ్చాయి.

‘చౌకీదారు చోర్ హై’ అంటూ మోడీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించాడు. ఆ విషయంలో కేసులు - కోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చింది. అలాగే ఆర్ ఎస్ ఎస్ విషయంలో చేసిన వ్యాఖ్యలు - బీజేపీ వాళ్లపై చేసిన ఆరోఫణలు.. ఇవన్నీ రాహుల్ పై కేసులకు కారణం అయ్యాయి.

ఇలా రాహుల్ పై గత ఐదేళ్లలో నమోదు అయిన కేసుల సంఖ్య పదిహేను వరకూ ఉందని తెలుస్తోంది. ఈ అంశంపై రాహుల్ స్పందించారు. తన మీద పదిహేనో పదహారో కేసులున్నాయని.. అవన్నీ తనకు మెడల్స్ లాంటి వని రాహుల్ అన్నాడు.

అలాంటి కేసులు ఎన్ని వస్తే తను అంత గర్వంగా ఫీల్ అవుతానంటూ రాహుల్ ప్రకటించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన మీద కేసులు పెడుతున్నారని రాహుల్ చెబుతున్నాడు. తను ఎంతగా పోరాడితే అన్ని కేసులు పెడతారని.. అందుకే తను ఇక ముందు కూడా కేసులకు గర్వపడబోతున్నట్టుగా రాహుల్ ప్రకటించాడు. అలాంటి కేసులు తనను నిస్తేజరపరచవని, తనకు ప్రజల సపోర్ట్ ఎంకరేజ్ మెంట్ అని రాహుల్ అంటున్నాడు.

రాహుల్ పై నేషనల్ హెరాల్డ్ కేసు కూడా ఉంది. ఆ కేసులో రాహుల్, సోనియా..ఇద్దరూ బెయిల్ మీద ఉన్నారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల సమయంలో ఎద్దేవా చేశారు.


Tags:    

Similar News