అత్తగారు, భార్య, భర్త... భారతీయ టెక్ జంట విడాకుల వెనుక...!
అవును... ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటలు చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంటున్నట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే!;
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తోన్న ఎన్నో విడాకుల సంగతి అటుంచితే.. అందుకు గల కారణాలు, ఆ నిర్ణయాలకు దారి తీస్తోన్న పరిస్థితులు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఓ జంట సంసార జీవితంలో విడాకులకు దారితీసిన పరిస్థితులు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇందులో భార్యది తప్పా..? భర్తది తప్పా..? పరిస్థితులను అర్ధం చేసుకోని భర్త తల్లిది తప్పా..? అనే ఎన్నో చిక్కు ప్రశ్నలకు ఈ సంఘటన వేదికగా మారిందని అంటున్నారు.
అవును... ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటలు చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంటున్నట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే! అయితే.. "నా కళ్లతో చూడు తెలుస్తుంది!" అన్నట్లుగా ఎవరి సమస్యలు వారికి పెద్దవి అని చెప్పేవారు లేకపోలేదు! ఈ క్రమంలో తన స్నేహితురాలు, ఆమె భర్త దాంపత్య జీవితంలో విడాకులకు దారితీసిన పరిణామాలను, పాత్రల స్వభావాలను, పరిస్థితులను వెళ్లడిస్తూ ఓ నెటిజన్ 'ఎక్స్' లో చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆమె చేసిన పోస్ట్ ప్రకారం... తాము +2లో ఉన్నప్పుడు ఓ చిన్ననాటి స్నేహితుడు, ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాడు.. వారు బీటెక్ లోనూ ఆ సంబంధాన్ని కొనసాగించారు.. చదువు అనంతరం టెక్ మహీంద్రాలో ఉద్యోగంలోనూ కలిసే చేరారు.. తర్వాత కంపెనీలు మారారు.. వివాహం చేసుకున్నారు.. ఇద్దరు పిల్లలను కన్నారు.. ఒక ఇల్లు కొన్నారు.. ఇలా సాఫీగా సాగిపోతుంది వీరి జీవితం. ఈ క్రమంలో.. గర్భం దాల్చిన ఆరు నెలలు తప్ప ఆమె ఎప్పుడూ విరామం తీసుకోకుండానే పని చేసిందని ఆ పోస్ట్ వెల్లడించింది.
ఈ క్రమంలో భర్త తల్లి అనారోగ్యానికి గురైంది.. దీంతో వీరి సంసారంలో సమస్యలు మొదలయ్యాయి.. తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం భార్యను ఉద్యోగం మానేయాలని భర్త కోరాడు.. అయితే తాను గర్భదారణ కారణంగా ఇప్పటికే చాలా సెలవులు తీసుకున్నానని చెబుతూ.. ఉద్యోగం మానేయడానికి ఆమె అంగీకరించలేదు.. అవకాశం ఉంటే తన భర్తనే లాంగ్ లీవ్ పెట్టమని.. ఈ సమయంలో ఇంటి ఖర్చులకు తాను సహకరిస్తానని తెలిపిందని తెలుస్తోంది.
అదే సమయంలో.. పిల్లలిద్దరినీ చూసుకోవడానికి తన తల్లిని తోడు రమ్మంటానని ఆమె తన భర్తతో చెప్పింది.. అయితే తన ఇంట్లో తన వియ్యపురాలు ఉండటం అతని తల్లికి సౌకర్యంగా లేదని.. అది తన కొడుకు ఇల్లని ఆమె భావించిందని.. కానీ అది తన కొడుకు, కోడలు ఇద్దరూ కలిసి కొన్నారని పోస్ట్ తెలిపింది! ఈ క్రమంలో ఆమెను రకరకాల మార్గాల్లో మానసికంగా వేధించడం ప్రారంభించారని ఆ పోస్ట్ ఆరోపించింది.
కట్ చేస్తే... ఆ ఇల్లాలు తన పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది.. ఈ క్రమంలో తన తల్లితండ్రుల వద్దకు వెళ్లింది.. తన భర్త కోరుకుంటే.. నా తల్లితండ్రులతో కలిసి ఆమె (తన అత్తగారు) బ్రతకొచ్చని చెప్పింది.. వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది.. విడాకులు తీసుకుంటానని బెదిరిస్తూ భర్త ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు.. దీంతో.. ఆమె విడాకులకు దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో.. ఎన్నో చిక్కు ప్రశ్నలకు వేదికగా నిలిచిన ఈ సంఘటన... స్త్రీ ద్వేషపూరిత వ్యవస్థలో ఒక స్త్రీ ఎంత కష్టపడి పనిచేసినా.. ఎంత సంపాదించినా.. ఎంత ప్రేమించినా.. మరెంతగా త్యాగం చేసినా.. ఆమె తన స్వయంప్రతిపత్తిని వదులుకోవడానికి నిరాకరించిన సమయంలో మాత్రం ఆమెను పనికిరానిదిగా పరిగణిస్తారంటూ ఈ సోషల్ మీడియా పోస్ట్ ముగిసింది!