• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాహుల్.. తెగే వరకూ...

రాహుల్.. తెగే వరకూ లాగేస్తాడా!

By - Tupaki Desk
Update: 2019-04-18 17:30 GMT
తన చెల్లెలు ప్రియాంక వాద్రా విషయంలో రాహుల్ గాంధీ తీరు చర్చనీయాంశంగా మారింది. ఆమెను ఎన్నికల్లో పోటీ చేయించడం విషయంలో రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీలోనే ఒకింత ఆందోళనకరమైన అంశంగా మారింది. ఎన్నికల్లో పోటీకి ప్రియాంక ఉత్సాహంగా ఉన్నారు. అది కూడా ఆమె వారణాసి నుంచి మోడీ మీద పోటీకి సై అంటున్నారు.

ఆమె అంటే అన్నారు కానీ, అది అనడం వరకే అయితే ఒక రకం. ప్రియాంకను మోడీ మీద పోటీ చేయిస్తారా? అని అంటే మాత్రం రాహుల్ ఇంకా నిర్ణయించలేదని అంటున్నారు. ఆ అంశం గురించి సస్పెన్స్ ను అనుభవించండి అని చెబుతున్నారు రాహుల్ గాంధీ.

అయితే రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీని దెబ్బతీస్తాడా? అనేది చర్చనీయాంశం అవుతోంది. ప్రియాంకను మోడీ మీద పోటీ చేయించడం అంటే అది అమీతుమీ తేల్చుకోవడమే. దాని వల్ల కాంగ్రెస్ కు రెండు రకాల పరిస్థితులు ఎదురుకావొచ్చు.

ఒకవేళ ప్రియాంక వారణాసిలో మోడీ మీద విజయం సాధిస్తే అంతకన్నా  సంచలనం ఉండదు. అయితే అలాంటి సంచలనం నమోదు అవుతుందా? అనేదే సందేహం. ఎంతైనా ప్రధాని హోదాలో ఉన్న మోడీని - అది కూడా యూపీలో, వారణాసిలో ఓడించడం అంటే మాటలు కాదు. అది అంత తేలికగా సాధ్యం అయ్యేది కాదు. ఉన్నట్టుండి వెళ్లి ప్రియాంక అక్కడ నామినేషన్ వేస్తే గెలిచేస్తుందా? అనేది సందేహమే.

మోడీ మీద కదా.. ఓడిపోయినా ఫర్వాలేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. ప్రియాంకను  కాంగ్రెస్ పార్టీ తురుపు ముక్కగా భావిస్తోంది. ఇలంటి సమయంలో ఆమె గనుక మోడీ చేతిలో ఓడిపోతే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ మరింత చులకన అయ్యే అవకాశాలున్నాయి.

ఇప్పటికే రాహుల్ తో బీజేపీ ఆడేసుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో ప్రియాంక రావడం - రావడంతోనే మోడీ మీద పోటీ చేసి ఓడిపోతే..అది చాలా పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సారి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం ఏమీ తేలికా కాదు. గత ఎన్నికలతో పోలిస్టే కొద్దో గొప్పో మెరుగుపడితే చాలన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇలాంటి  తరుణంలో ప్రియాంకను కూడా అలా ప్రయోగించేస్తే.. ఫలితాలు తేడా కొడితే  కోలుకోవడానికి కూడా ఇబ్బందే అవుతుందని కాంగ్రెస్ వాల్లు అనుకుంటున్నారు.  అందుకే  ప్రియాంకను పోటీ చేయించకపోవడమే  మేలనేది కాంగ్రెస్ వాదుల లెక్క. మరి ఈ అంశంలో రాహుల్ తెగే వరకూ లాగుతాడో - లేక కామ్ అవుతాడో చూడాలి!
Tags:    
  • Rahul gandhi 
  • Priyanka Gandhi 
  • Narendra Modi 

Similar News

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS