• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బంగ్లా బార్డర్ లో భారత...

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

| భారత సరిహద్దులను ప్రాణాలకు తెగించి కాపాడుతున్న భద్రతా బలగాలపై ఎలాంటి దాడులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని త్రిపుర ప్రభుత్వం స్పష్టం చేసింది.

By - A.N.Kumar
Update: 2026-11-03 18:09 GMT

భారత సరిహద్దులను ప్రాణాలకు తెగించి కాపాడుతున్న భద్రతా బలగాలపై ఎలాంటి దాడులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని త్రిపుర ప్రభుత్వం స్పష్టం చేసింది. సరిహద్దుల వద్ద విధుల్లో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లపై భౌతిక దాడికి పాల్పడిన ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. నిందితులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ దాడి ఘటనతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.

త్రిపురలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన బోక్సానగర్ పరిధిలోని ఆశాబరి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సరిహద్దు ప్రాంతంలో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిరంతరం గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లపై కొందరు స్మగ్లర్లు, స్థానిక గ్రామస్థులు కలిసి ఒక్కసారిగా భౌతిక దాడికి దిగారు. స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకున్నారనే కక్షతో బీఎస్ఎఫ్ సిబ్బందిపై విరుచుకుపడటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

జవాన్లపై దాడి ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తీవ్రంగా స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ సరిహద్దు రక్షణలో ఉన్న సైనికులపై దాడి చేయడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఎనిమిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా సీఎం వెల్లడించారు. చట్టప్రకారం వారందరిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. భద్రతా బలగాల జోలికొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు భద్రతాపరంగా ఎంతో సున్నితమైనవి. పశువుల స్మగ్లింగ్, మాదకద్రవ్యాల సరఫరా.. ఇతర అక్రమ వస్తువుల రవాణా, అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు BSF బలగాలు అహోరాత్రులు శ్రమిస్తున్నాయి. అయితే స్మగ్లింగ్ మాఫియా స్థానికులను రెచ్చగొట్టి జవాన్లపై దాడులకు పురిగొల్పుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జవాన్లకు స్థానిక ప్రజలు సహకరించాల్సింది పోయి వారి విధులకు ఆటంకం కలిగించడం పట్ల పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

Tags:    
  • bsf 
  • tripura 
  • bsfjawans 
  • bordersecurity 
  • indiabangladeshborder 

Similar News

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS