ఓయూతో రాహుల్.. గేర్ మార్చుడే...
తెలంగాణాలో ఉస్మానియా యూనివర్శిటీకి చాలా రాజకీయ ప్రాముఖ్యత ఉంది. దేశంలో చాలా వర్శిటీలు విద్యాబుద్ధులు నేర్పితే కొన్ని వర్శిటీలు చైతన్యాన్ని కూడా నిండా నింపుతాయి. బుక్కిష్ నాలెడ్జితో జాబ్స్ వస్తే రావచ్చు కానీ చైతన్యం మెదడుకు ఎక్కిస్తే అతను కొన్ని తరాలను విశేషంగా ప్రభావితం చేస్తాడు.
నిజానికి విద్యార్ధి పరిపూర్ణతను సాధించేది కూడా అక్కడే. అలా చూసుకుంటే ఓయూ ఎందరినో నేతలను చేసింది. మరెందరో నేతలను చూసింది. అలాంటి ఓయూ కేసీయార్ కి ఒకనాడు అండగా నిలబడింది. నిజానికి హైదారాబాద్ నడిబొడ్డున ఉన్న ఓయూ చేసిన పోరాటాలు అండగా నిలిచిన ఉదంతాలు చరిత్రలో నిలిచిపోయే ఘటనలు.
కేసీయార్ ఉద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేసిన ఓయూని ఎవరూ మరచిపోరు. ఇక ఉద్యమ బాట వీడి అధికారం నీడన చేరిన టీయారెస్ తో ఓయూ విద్యార్ధి చాలా కాలంగా డిఫర్ అవుతూ వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మళ్లీ ప్రజల పక్షం అంటూ అక్కడ గళం వినిపిస్తోంది.
ఈ క్రమంలో ప్రతిపక్షానికి బాగా చోటు లభిస్తోంది. అలా ఓయూ మరోమారు తెలంగాణా రాజకీయాల్లోఅ అతి కీలకమైన పాత్రనే పోషిస్తోంది అని చెప్పాలి. ఆ ఓయూని ఇపుడు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ సందర్శిస్తున్నాడు. ఈ ప్రోగ్రాం చాలా కాలం క్రితమే ఫిక్స్ అయినా ఓయూకు రాహుల్ వచ్చేందుకు టీయారెస్ సర్కార్ మాత్రం అనుమతి ఇవ్వలేదు.
దాంతో కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్ళి మరీ పర్మిషన్ సంపాదించారు. దాంతో టీయారెస్ ఒక విధంగా ఓడినట్లు అయింది. అదే టైమ్ లో రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి. రాహుల్ ఈ నెల 6న తెలంగాణా టూర్ పెట్టుకున్నారు. ఆయన వరంగల్ లో జరిగే సభలో పాలుపంచుకుంటారు. ఆ తరువాత ఓయూకి ఆయన చేరుకుంటారు.
అక్కడ విద్యార్ధులతో ముఖాముఖీ భేటీ అవుతారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. వారి నుంచి కూడా అనేక సలహా సూచనలు స్వీకరిస్తారు. ఈ పరిణామాలు ఒక విధంగా రాజకీయంగా టీయారెస్ కి ఇబ్బందిని కలిగించేవే అంటున్నారు. ఎలాగైనా రాహుల్ ఓయూని సందర్శించకుండా ఆపాలనుకోవడమే టీయారెస్ చేసిన తప్పు.
ఇపుడు ఎటూ ఆయన రాక తప్పలేదు, ఓయూ టూర్ అంతకంటే తప్పలేదు, ఇక రెట్టించిన ఉత్సాహాన్ని కాంగ్రెస్ కి అందించి ఆ పార్టీకి జవజీవాలను టీయారెస్ ఇచ్చింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే తెలంగాణా కాంగ్రెస్ కి కచ్చితంగా రాహుల్ టూర్ ఒక ఆక్సిజన్ లాంటిదే అని చెప్పకతప్పదు.
తెలంగాణాలో అతి పెద్ద పార్టీ, ఇంకా గట్టిగా చెప్పాలీ అంటీ బూత్ లెవెల్ దాకా ఉన్న పటిష్టమైన పార్టీ కాంగ్రెస్. ఆ విషయంలో రెండవ మాటకు తావు లేవు. కాంగ్రెస్ చేస్తున్న తప్పులు, ఐక్యత లేకపోవడం, అధినాయకత్వం ఉదాశీనత, రాంగ్ స్ట్రాటజీస్ అన్నీ కలసి ఆ పార్టీని అలా చేసి పారేశాయి.
ఇపుడిపుడే కాంగ్రెస్ నేతలు మేలుకొంటున్నారు. అలాగే హై కమాండ్ కూడా ఫోకస్ పెడుతోంది, ఇంకో వైపు టీయారెస్ గ్రాఫ్ తగ్గుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణా తెచ్చిన పార్టీగా రెండు సార్లు గులాబీ పార్టీని నెత్తిన పెట్టుకుని మోసి విసుగెత్తిన జనాలకు తెలంగాణా ఇచ్చిన పార్టీని కూడా ఒకసారి తలకెత్తుకుందామన్న ఆలోచన వస్తుందని కూడా అంటున్నారు.
ఇలా ఏ విధంగా చూసుకున్నా రాహుల్ టూర్ ని లైట్ తీసుకోకుండా కొంత బిగించి భంగపడిన టీయారెస్ అనుకోకుండా రాహుల్ కి హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. దాంతో ఓయూలో రాహుల్ పాదం మోపుతున్నారు. ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెలంగాణా రాజకీయ వెండితెర మీద చూడాల్సిందే.