అమ్మ సెంటిమెంట్ తో మోడీకి షాకిచ్చిన రాహుల్!

Update: 2018-05-10 10:09 GMT
ఎప్పుడూ లేనంత ఎక్కువ‌గా టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లుగా క‌నిపిస్తున్నారు ప్ర‌ధాని మోడీ. అస‌లే సౌత్ సెంటిమెంట్‌. దానికి తోడు.. క‌ర్ణాట‌క‌లో తేడా వ‌స్తే.. ప‌త‌నం స్టార్ట్ అయ్యిందంటూ ప్ర‌తిప‌క్షాలు చెల‌రేగిపోతాయ‌న్న భ‌యం కావొచ్చు.. మోడీ మాట‌ల తీవ్ర‌త ప్ర‌ధాని స్థాయికి  చాలా త‌క్కువ‌గా ఉన్న‌ట్లుగా ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల్ని సంధిస్తున్న మోడీ తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. నిన్న‌టికి నిన్న రాహుల్ ను ఉద్దేశించి ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్టాల‌న్న ఆయ‌న స్వ‌ప్నంపై అహంకారం ముద్ర వేసిన మోడీపై సోష‌ల్ మీడియాలో కామెడీ చేసుకుంటున్నారు.

పార్టీలో ఉన్న అద్వానీని ప‌క్క‌న పెట్టేసి గ‌ద్దెనెక్కిన మీరా ఇలాంటి మాట‌లు చెప్పేద‌న్న మాట‌లు వినిపిస్తున్నాయి. ఈ డ్యామేజ్ సంగ‌తి ఇలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై రాహుల్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

త‌ర‌చూ తాను బాధితుడిగా అభివ‌ర్ణించుకునే మోడీ.. అలాంటి అవ‌కాశాన్ని రాహుల్‌ కు ఇవ్వ‌టం.. ఆయ‌న అందిపుచ్చుకుంటూ మ‌ద‌ర్ సెంటిమెంట్‌ ను బ‌య‌ట‌కు తీయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. సోనియాను ఇట‌లీ దేశ‌స్తురాలు అంటూ ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై రాహుల్ రియాక్ట్ అయ్యారు.

తాను చూసిన చాలామంది భార‌తీయుల కంటే.. త‌న త‌ల్లి సోనియాగాంధీ గొప్ప‌దంటూ కౌంట‌ర్ ఇచ్చారు. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌న‌పైనా.. త‌న త‌ల్లి జాతీయ‌త పైనా మోడీ చేసిన వ్యాఖ్యాల్ని తిప్పి కొట్టేలా రాహుల్ కౌంట‌ర్ ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

త‌న త‌ల్లి ఇట‌లీ దేశ‌స్తురాల‌ని.. ఆమె త‌న జీవితంలో అధిక‌భాగం భార‌త్‌లోనే గ‌డిపిన వైనాన్ని గుర్తు చేశారు. భార‌తీయుల‌మ‌ని చాలామంది చెప్పుకుంటార‌ని.. అలాంటి వారి కంటే త‌న త‌ల్లికి ఎక్కువ అర్హ‌త ఉంద‌న్నారు. ఈ దేశం కోసం ఆమె త్యాగం చేసింద‌ని.. దేశం కోసం ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొన్నార‌న్నారు.

ప్ర‌ధాని మోడీ స్థాయి ఏమిటో.. ఆయ‌న వ్యాఖ్య‌లు చెబుతున్నాయ‌ని.. ఆయ‌న‌లా మాట్లాడ‌టం ఆయ‌న‌కు ఇష్ట‌మైతే.. అది ఆయ‌న విజ్ఞతకే  వ‌దిలేస్తున్న‌ట్లుగా చెప్పారు. ఈ సంద‌ర్భంగా బుద్దుడు చెప్పిన మాట‌ల్ని రాహుల్ ఉటంకించారు. ఒక కోపిష్టి ఎంత తిడుతున్నా బుద్ధుడు మాత్రం స్పందించ‌లేద‌ని.. ఎందుకని అడిగిన శిష్యుల‌కు స‌మాధానం చెబుతూ.. అత‌డు నాకు ఆగ్ర‌హాన్ని బ‌హుమ‌తిగా ఇచ్చాడు. అది నాకు అవ‌స‌రం లేదని చెప్పిన‌ట్లు గుర్తు చేశారు. త‌న‌తో ప్ర‌మాదం ఉంద‌ని మోడీకి కోప‌మ‌ని.. కానీ.. ఆయ‌నంటే త‌న‌కు కోపం లేద‌ని.. కోపం అనేది ఆయ‌న‌కే స‌మ‌స్య కాద‌ని.. త‌న‌కు మాత్రం కాదంటూ తెలివిగా రాహుల్ బ‌దులిచ్చారు. సోనియాపై మోడీ చేసిన విమ‌ర్శ‌లు.. దానికి కౌంట‌ర్ గా రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు మోడీ అండ్ కోను డిఫెన్స్ లో ప‌డేసేలా చేశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News