పీడీతో రాహుల్ బిజీ..అవాక్కయిన కాంగ్రెస్ నేతలు

Update: 2019-05-29 16:11 GMT
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కనిపించడం లేదు. లోక్‌ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ నిరాశాజనక ఫలితాలను చవిచూడటంతో పార్టీ అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ రాజీనామా చేశారు. అయితే, ఆయన రాజీనామాను సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తోసిపుచ్చింది. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. అయితే, ఇప్పటికీ రాహుల్ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గకపోవడంతో ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాల వద్ద కార్యకర్తలు సంఘీభావ ప్రదర్శనలకు దిగుతున్నారు. కానీ, రాహుల్ మాత్రం స్పందించడం లేదు.

 రాహుల్ కనిపించకపోవడంతో అందరి దృష్టి అతడిపైనే పడింది. అసలు రాహుల్ ఏమైపోయారు..? ఎక్కడికి వెళ్లారు..? రాజీనామాకు కట్టుబడే ఉన్నారా..? లేక తన నిర్ణయాన్ని మార్చుకుంటారా..? అంటూ చాలా మంది పలు అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని రాహుల్ నివాసం దగ్గర తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు కూడా దిగారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. కానీ, రాహుల్ మాత్రం పీడీతో బిజీగా గడుపుతున్నారు. ఇంతకీ పీడీ అంటే ఎవరు అనేగా మీ సందేహం..? ఈ పీడీ అంటే రాహుల్ పెంపుడు కుక్క. దీని గురించి చాలా మందికి తెలుసు. గతంలో రాహుల్.. పీడీతో సరదాగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 అయితే, ఇప్పుడు తన పెంపుడు కుక్కతో సరదగా గడుపుతున్న విషయం బయటకు రావడానికి కారణం ఓ నెటిజన్ చేసిన ట్వీటే. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన ఆ బాధ మర్చిపోయేందుకు సరికొత్త దారిని ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే తన పెంపుడు కుక్క(పీడీ)తో షికారుకెళ్తూ ఫోటోగ్రాఫర్లకు చిక్కాడు. తుగ్లక్ లేన్ వద్ద గల తన ఇంటి నుంచి కారులో పిడితో కలిసి వెళ్లున్నారు. కారు వెనుక సీటులో రాజసంగా పీడీ కూర్చుంది. ఈ ఫోటోను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రాహుల్ గురించి బయటకు వచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ ఎవరినీ కలువకపోవడంతో ఢీలా పడిన కాంగ్రెస్ నేతలు.. కుక్కతో కలిసి షికారు చేయడం చూసి అవాక్కవుతుండగా, కొందరు మాత్రం సెటైర్లు వేస్తున్నారు.


Tags:    

Similar News