మోడీ మాట‌ల మేజిక్ గుట్టు ఇదేనట‌!

Update: 2018-06-05 06:19 GMT
ప్ర‌శ్న ఏదైనా మోడీ స‌మాధానం అదిరేలా ఉంటుంది. ఎంతైనా మోడీ క‌దా? అని మురిసిపోయినోళ్లు ఎంతోమంది. అయితే.. ఇదంతా పక్కా ప్లాన్ అని చెబుతూ సంచ‌ల‌నానికి తెర తీశారు కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ. ప్ర‌శ్న అడిగిన వెంట‌నే అదిరేలా స‌మాధానం చెప్ప‌టం వెనుక ప్రీప్లాన్ ఉంటుంద‌ని.. అంతేకానీ.. అనుకోని రీతిలో ప్ర‌శ్న‌లు సంధిస్తే మోడీ స‌మాధానం చెప్ప‌లేర‌ని ఆయ‌న చెబుతున్నారు.

మీటింగ్ ఏదైనా కానీ అప్ప‌టిక‌ప్పుడు అడిగే ప్ర‌శ్న‌ల‌కు మోడీ స‌మాధానాలు చెప్ప‌లేర‌ని.. ఒక‌వేళ చెప్పినా విన‌టానికి ఇబ్బందిగా ఉంటుందని ఆరోపిస్తున్నారు.  తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ లో ఈ విష‌యాన్ని చెప్ప‌ట‌మే కాదు.. త‌న ఆరోప‌ణ‌ల‌కు ఆయ‌నో సాక్ష్యాన్ని చూపిస్తున్నారు.

ఇటీవ‌ల సింగ‌పూర్ లో ని న‌న్యాంగ్ టెక్నాల‌జీ వ‌ర్సిటీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అక్క‌డి వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మోడీ హిందీలో స‌మాధానం ఇచ్చారు. అయితే.. మోడీ మాట‌ల్ని ట్రాన్స్ లేట్ చేసిన అనువాద‌కుడి త‌ప్పు కార‌ణంగా మోడీ మేజిక్ బ‌య‌ట‌కు పొక్కిన‌ట్లుగా చెబుతున్నారు. మోడీ స‌మాధానాన్ని ట్రాన్సలేట్  చేయాల్సిన అనువాద‌కుడు ఒక కాగితం తీసి త‌ర్జుమా చేశారు. ఈ సంద‌ర్భంగా మోడీ సమాధానంలో లేని అంశాల్ని.. అంకెల్ని ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం.

ఇది చాలు.. మోడీ చెప్పే స‌మాధానాలు ఏవీ కూడా అప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న నోటి నుంచి వ‌చ్చేవి కావ‌ని.. ముంద‌స్తుగా క‌స‌రత్తు చేస్తార‌న్న అభిప్రాయాన్ని రాహుల్ వ్య‌క్తం చేస్తున్నారు. ముందుగా అనుకున్న స‌మాధానాల్ని క‌వ‌ర్ చేస్తార‌ని.. కావాలంటే చూడాలంటూ ఒక వీడియోను రాహుల్ త‌న ట్వీట్‌తో జ‌త చేశారు. మ‌రి.. దీనికి బీజేపీ వ‌ర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో..?


Tags:    

Similar News