బాబు గారు...ఇక్క‌డ స్టార్ట‌యిపోయింది

Update: 2016-01-11 10:38 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి-తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌మదైన మ‌రోమారు త‌మ విమ‌ర్శ‌ల దాడిని మొద‌లుపెట్టాయి. ఇటీవ‌లి కాలం వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా కేంద్రంగా బాబుపై స్పందించిన రాజకీయ పార్టీలు ఇపుడు విశాఖ‌ప‌ట్ట‌ణంలో జ‌రుగుతున్న సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు కేంద్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

కొంత గ్యాప్ త‌ర్వాత తెర‌మీద‌కు వ‌చ్చిన ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి బాబుపై సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టైంపాస్ కార్యక్రమాలు పక్కనపెట్టాలని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు విజన్ 2020 అన్నార‌ని.. ఆయన అధికారం ముగిసేలోగా లక్ష కోట్లు తెస్తాన‌ని చెప్పార‌ని గుర్తుచేశారు. క‌నీసం  లక్ష రూపాయలు కూడా తేలేదని మండిప‌డ్డారు. ఇప్పుడేమో రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటున్నార‌ని...ఇదంతా బోగస్ అని విమ‌ర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఏమైందని ర‌ఘువీరా ప్ర‌శ్నించారు. ప్రత్యేకహోదాతో కూడిన రాయితీలు వస్తే...ఇలాంటి స‌ద‌స్సులు నిర్వహించాల్సిన అవసరం లేదని, రాయతీలు వస్తే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయని తెలిపారు. హోదా కోసం పోరాడాలని ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టాలని చంద్ర‌బాబుకు ర‌ఘువీరా సూచించారు. కేవలం టీవీ, వార్తా పత్రికల కవరేజ్ కోసం కార్యక్రమాలు చేయవద్దని ఎద్దేవా చేశారు. విజన్ 2020 లా విజన్ 2050 ప్రవేశపెడుతున్నారని, ఇవన్నీ ప్రజలు వినేసిన కథలని ఆయన కొట్టిపడేస్తూ చంద్రబాబుకు చేతనైతే ప్రత్యేకహోదా తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

మ‌రోవైపు సీఐఐ స‌ద‌స్సుపై ప్ర‌తిప‌క్ష వైసీపీ విమ‌ర్శలు చేసింది. ఈ స‌ద‌స్సు ద్వారా సాధించిన పెట్టుబ‌డులు ఎన్నో శ్వేతప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. గ‌తంలో నిర్వ‌హించిన ప‌లు స‌ద‌స్సుల ద్వారా వ‌చ్చిన పెట్టుబ‌డుల గురించి కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స్పష్ట‌త ఇవ్వాల‌ని ఆ పార్టీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి కోరారు.
Tags:    

Similar News