దీక్షల పేరుతో హింసిస్తున్న శాడిస్ట్ బాబు
రాష్ట్రవ్యాప్తంగా నవనిర్మాణ దీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం, ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో టీడీపీ నేతలు దీక్షలు చేపట్టడంపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో మరో ప్రచార ఆర్భాటానికి బాబు తెర లేపారని మండిపడ్డారు. తన ప్రచార యావ కోసం చిన్న పిల్లలలను తీసుకువచ్చి ఎర్రని ఎండలో నిలబెట్టారని, రోడ్లపై ట్రాఫిక్ జాంలకు కారణంగా మారారని రఘువీరా రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోరుతూ మూడు రోజులుగా చేపడుతున్న నిరాహార దీక్షను పోలీసులు గురువారం భగ్నం చేశారు. దీక్షలో ఉన్న 11 మందిని అరెస్టు చేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిని శుక్రవారం పరామర్శించి దీక్షలు విరమింపచేసిన సందర్భంగా రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రం విడిపోయిన రోజుని నవ నిర్మాణ దీక్ష పేరుతో సంబరాలు జరుపుకుంటూ రాష్ట్ర ప్రజలను టీడీపీ మరింతగా అవమానిస్తోందని రఘువీరారెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో రాష్ట్రాభివృద్ధికి అనేక హామీలిస్తే వాటి ఊసేత్తకుండా ప్యాకేజీలు చాలంటూ టీడీపీ నేతలు చేతులు దులుపుకోవడం దారుణమని మండిపడ్డారు. దీక్షలో పాల్గొన్న ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మూడేళ్లు గడుస్తున్నా సీఎం చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలు చేయటం దారుణమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత విధానాలతో నేడు రాష్ట్రం వేల కోట్ల రూపాయల్ని నష్టపోయిందని, విభజన చట్టం మురిగిపోయిందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/