లోకేష్ కు అంత సీన్ లేదట.. బీజేపీ తేల్చేసింది..!

Update: 2019-07-14 06:25 GMT
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబు నాయకత్వంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2024 వరకు వృద్ధాప్యంతో బాధపడే చంద్రబాబు స్థానంలో భవిష్యత్ నేత ఎవరంటూ చర్చ జరుగుతోంది. చంద్రబాబు మాత్రం తన తనయుడు లోకేష్ నే భవిష్యత్ నేతగా చూపిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం తాజాగా లోకేష్ నాయకత్వంపై తాజాగా హాట్  కామెంట్స్ చేసింది.

ఆల్ ఇండియా టొబాకో బోర్డ్ చైర్మన్ గా నియమితులైన ఏపీ బీజేపీ సీనియర్ నేత రఘునాథ బాబు తాజాగా లోకేష్ నాయకత్వంపై హాట్ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోరు ఉంటుందని టీడీపీ మరింత మునిగిపోవడం ఖాయమంటున్నారు.

బీజేపీ నేత రఘునాథ బాబు తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ చంద్రబాబుతో పాటు చాలా మంది సీనియర్లు - సమర్థులు ఉన్నారని.. వారందరికీ పక్కనపెట్టి అస్సలు నాయకత్వ లక్షణాలు లేని లోకేష్ బాబును టీడీపీపై ఎందుకు రుద్దుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. లోకేష్ కు నాయకత్వం ఇస్తే టీడీపీ మునగడం ఖాయమని.. చంద్రబాబు ఆ పని చేయకుండా ఉంటేనే మంచిదని హాట్ కామెంట్ చేశారు.

ప్రతిభ లేని వారసులను తీసుకొచ్చి పార్టీ పగ్గాలు అప్పగిస్తే తాము ఉన్న చెట్టును తామే నరుకున్నట్టు అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీలో ఎంతో మంది మంచి నాయకులున్నారని వారిని ప్రోత్సహించడం లేదన్నారు.

నాడు చంద్రబాబు స్వంతంగా చిత్తూరు జిల్లాలో విద్యార్థి నాయకుడిగా ఎమ్మెల్యే - మంత్రిగా స్వతహాగా నాయకత్వ లక్షణాలతో కింది స్థాయి నుంచి పైకి వచ్చాడని.. అలా స్వతహాగా లోకేష్ కు నాయకత్వ లక్షణాలు రాలేదని.. తండ్రి చాటు బిడ్డగా నాయకత్వం వస్తుందనే అది ఫ్లాప్ అవుతుందని స్పష్టం చేశారు.


Tags:    

Similar News