రేడియాలజిస్ట్ ఉమామహేశ్వరరావు మీద రేపిస్టు ముద్ర ఎలా పడింది? అతనేం చెప్పాడు?
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ‘గాంధీలో గ్యాంగ్ రేప్’ ఉదంతంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమామహేశ్వరరావు తప్పు చేయలేదని.. అతడికి ఆ ఉదంతంతో ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని పోలీసులు నిర్దారించటం తెలిసిందే. రేడియాలజిస్టుగా గాంధీ ఉద్యోగి అయిన అతడి మీద రేపిస్టు ముద్ర ఎలా పడింది? అతడి జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఎక్కడి వరకు తీసుకెళ్లాయి? దారుణ నేరం చేసినట్లుగా పడిన ముద్ర ఎలా తొలగింది? ఆ టైంలో ఏం జరిగింది? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని ఆయనో మీడియా సంస్థతో మాట్లాడారు. అతనేం చెప్పాడన్నది ఆయన మాటల్లోనే చూస్తే..
- ఆగస్టు 16 మధ్యాహ్నం లంచ్ చేస్తున్న వేళలో చిలకలగూడ పోలీసులు ఫోన్ చేసి రమ్మన్నారు. భోజనం మధ్యలో వదిలేసి వెంటనే అక్కడికి వెళ్లా. ఆసుపత్రిలో ఏదైనా విషయం కోసమని అనుకున్నా.. స్టేషన్ కు దగ్గర్లో మీడియా వాళ్లు ఉండటంతో వారికి కనిపించకుండా లోపలకు తీసకెళ్లారు. అక్కడ మా దూరపు బంధువు ఉంది. ఏం జరిగిందని పోలీసులు అడిగితే.. నా వైపు చూపించి.. అతను మరికొందరు సామూహిక అత్యాచారం చేసిందని చెప్పింది.
- ఆ మాటకు కంగుతిననా. ఆ క్షణం జీవితంపై ఆశను కోల్పోయా. రెండు గంటల పాటు కఠినంగా ఇంటరాగేట్ చేశారు. తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చారు. నేను ఎలాంటి నేరం చేయలేదని మొత్తుకున్నా.. అనుమానంతో అన్ని రకాలుగా ప్రశ్నించారు. జైలే గతి అనుకున్న వేళ.. ఒక పోలీసు ఉన్నతాధికారి మాట నాకు కొత్త ఆశ కలిగింది. ఆ పాడు పని చేయకపోతే ధైర్యంగా ఉండు అని అన్నారు. దీంతో కాస్త స్థిమితపడ్డా.
- బుధవారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో హైదరాబాద్ సీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. కమిషనర్ అంజనీకుమార్ గదికి తీసుకెళ్లారు. నీకు.. సామూహిక అత్యాచారానికి సంబంధం లేదు. సంతోషంగా ఇంటికి వెళ్లు అన్నారు. బయటకొచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకున్నా. మిగిలిన పేపర్ వర్కు పూర్తి చేసి గురువారం రాత్రి వదిలేశారు.
- ఇంటికి వెళ్లినంతనే కొడుకు.. కుమార్తెల దగ్గర కూర్చుండిపోయా. తల్లి.. భార్య ఓదార్చారు. రేపిస్టు అన్న వార్తలు నన్ను కలిచివేశాయి. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నా. మహబూబ్ నగర్ లో ఉంటున్న దూరపు బంధువుకు మూత్రపిండాల వ్యాధి ఉందంటే గాంధీ ఆసుపత్రిలో చేర్పించా. అతనికి సాయంగా వచ్చిన ఇద్దరు మహిళలకు ఏం సాయం కావాలన్నా అడగమని చెప్పా. కల్లు తాగుతారని చెబితే.. ఆసుపత్రిలో దొరకదని చెప్పా. ఒక మహిళా సెక్యురిటీ గార్డును కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పా.
- ఆగస్టు 13న రోగి మరదలు ఆసుపత్రిలో కనిపించటంతో రోగి కొడుకుకు ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లమని చెప్పా. 15న గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో రోగి మరదలు అరకొర దుస్తులతో ఉంటే చూసి.. ఆమెకు దుస్తులు వేయమని ఫోన్ చేసి చప్పా. అదే రోజు సాయంత్రం రోగి కొడుకు వచ్చి ఆమెను తీసుకెళ్లాడు. తర్వాతి రోజు సామూహిక అత్యాచారం చేశారంటూ పోలీసులకు చెప్పటంతో సాయం చేసినందుకు ఇదా బహుమతి అని బాధపడ్డా. గ్యాంగ్ రేప్ కేసు అంటే జీవితాంతం జైల్లోనే ఉండాలని పోలీసులు అనటంతో షాక్ తిన్నా.
- ఇంటరాగేషన్ రెండో రోజు రాత్రి టాస్క్ ఫోర్సు సీఐ నాగేశ్వరరావు గంట సేపు ప్రశ్నించారు. సంబంధం లేకపోతే నిజాలు చెప్పాలన్నారు. మూడోరోజు టాస్కు ఫోర్సు డీసీపీ రాధాకిషన్ రావ్ కు నా మాటలు చెప్పారు. అదే రోజు రాత్రి డీసీపీ కల్మేశ్వర్ ను పిలిపించారు.కేసులో సంబంధం లేదని.. ఆధారాలు లభించాయని చెప్పారు. సీపీ అంజనీ కుమార్ వద్దకు తీసుకెళ్లారు. నేను చెప్పింది విన్న ఆయన.. నీకు సంబంధం లేదు.. ఇంటికి వెళ్లమన్నారు.