ఏపీ సీఎంకు సెటైర్ వేసిన సొంత మనిషి!?
ఏపీ సీఎం జగన్ మాజీ సలహాదారు.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ఆదివారం ఉదయం చేసిన ట్వీట్ తీవ్ర కలకలం రేపుతోంది. రాజకీయంగా పెను దుమారం చెలరేగింది.. జగన్ కోటరీ నుంచి వెళ్లిపోయిన పీవీ రమేశ్ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
పదవీ విరమణ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో సేవలందించిన పీవీ రమేశ్ గత ఏడాది చివరిలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన శాఖలను మార్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లోనే ప్రచారం సాగింది.
కొంతకాలంగా మౌనం పాటిస్తూ ఉన్న పీవీ రమేశ్ ఆదివారం ఉదయం అకస్మాత్తుగా ట్వీట్ చేసి బాంబు పేల్చారు. ‘‘నేరమే అధికారమై ప్రజలను నేరస్థులను చేసి వెంటాడుతుంటే.. ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడు నేరస్థుడే’ అని పీవీ రమేశ్ చేసి ట్వీట్ వైరల్ అయ్యింది. దీనికి కామెంట్స్, షేర్లు బోలెడు వచ్చాయి.
ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారంటూ కొందరు ప్రశ్నించగా.. చాలా మంది కింద కామెంట్లలో సీఎం జగన్ ను బేస్ చేసుకొనే పీవీ రమేశ్ ఈ కామెంట్ చేశారని.. ఆయన వద్ద పనిచేసిన అనుభవంతోనే రమేశ్ ఇలా రాశారంటూ వ్యాఖ్యాలు చేశారు. జగన్ పైనే ఈ ట్వీట్ చేశారని చాలామంది కామెంట్లు చేయడంతో దెబ్బకు పీవీ రమేశ్ కూడా స్పందించాల్సి ఉంది.
ఈ ట్వీట్ దుమారం రేపడంతో పీవీ రమేశ్ వివరణ ఇచ్చారు. ‘తాను ట్వీట్ చేసిన వరవరరావు కొటేషన్ ఏ ప్రభుత్వానికి వ్యక్తులకూ సంబంధించినది కాదని.. ఒక కవితలో భాగమంటూ సర్దుకొనే ప్రయత్నం చేశారు.