పురందేశ్వరి విచిత్రమైన వ్యాఖ్యలు

Update: 2020-12-27 06:30 GMT
‘రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం లేదు’ .. ఇది తాజాగా బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఆరోపణ. మరి ఆమె ఇంతకాలం ఏలోకంలో ఉన్నారో అర్ధం కావటం లేదు. ఒకవైపు వివిధ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో శంకుస్ధాపనలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితమే అపాచీ సంస్ధ కడపలో ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్ధాపన జరిగింది. అలాగే వైజాగ్ లో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. ఎంఆర్ఎఫ్ టైర్ల కంపెనీ ఏర్పాటుకు భూమిపూజ జరిగింది.

చిత్తూరు జిల్లాలోని సత్యవేడు శ్రీసిటీ సెజ్ లో అనేక కంపెనీలు ఏర్పుటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉభయగోదావరి జిల్లాల్లో కూడా పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. కర్నూలులో సిమెంట్ ఫ్యాక్టరి ఏర్పాటుకు శంకుస్ధాపన జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయినప్పటికీ ఇందులో దాదాపు ఎనిమిది నెలలు కరోనా వైరస్ ఎఫెక్టుతోనే సరిపోయింది. స్విట్జర్లాండ్ , స్వీడెన్ లోని కంపెనీలు కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.

వీటితో పాటు కొరియా కంపెనీ కూడా మోటారు సైకిళ్ళ తయారీకి స్ధలం కావాలని దరఖాస్తు చేసుకున్నది. కడపలో స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటుకు రెండు అంతర్జాతీయ సంస్ధలతో ఒప్పందాలు కూడా చేసుకున్నది ప్రభుత్వం. సరే ఈ విషయాలను పక్కకు పెట్టేస్తే పెట్టుబడులకు ఏపి అనువైన రాష్ట్రంగా ఈమధ్య కేంద్రప్రభుత్వమే ప్రకటించింది. ఈ విషయాన్ని పురందేశ్వరి గమనించినట్లు లేదు. ఏదో ప్రతిపక్షం కాబట్టి గుడ్డిగా వ్యతిరేకించాలన్న పాలసీతోనే పురందేశ్వరి మాట్లాడుతున్నట్లున్నారు.

ఇక ఇళ్ళపట్టాలపై మాట్లాడుతు వాళ్ళకు అందిన సమాచారం ప్రకారం ఇళ్ళపట్టాల పంపిణీ జరగటం లేదట. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు ఇళ్ళపట్టాల పంపిణీ మొదలైన సంగతి పురందేశ్వరికి ఎందుకు కనబడలేదో. లబ్దిదారులకు పొజెషన్ సర్టిఫికేట్ మాత్రమే ఇస్తున్నట్లు ఆమె ఆరోపించటమే విచిత్రంగా ఉంది. కోర్టులో కేసు సెటిల్ అవ్వగానే లబ్దిదారులకు రిజిస్ట్రేషన్లు చేస్తామని ఒకవైపు ప్రభుత్వం చెప్పిన విషయం పురందేశ్వరికి అర్ధంకాలేదేమో. ఇక రాజధానిపై తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని చెప్పటమే విచిత్రంగా ఉంది. కేంద్రమేమో రాజధానితో తమకు సంబంధం లేదని చెప్పేసిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News