రూ.10 వేలు పెట్టు..పని పట్టు..విజయవాడలో స్పా ముసుగులో వ్యభిచారం
వాళ్లు జస్ట్ ఓ డయల్ నంబర్ పెట్టారు. కాల్ చేస్తే నిర్వాహకులు ప్యాకేజీ బేరాలు చేస్తారు. పెట్టే అమౌంట్ ను బట్టి చెప్పిన అడ్రస్ కు వెళ్తే అక్కడ కావాల్సిన అమ్మాయిలు ఉంటారు. విజయవాడలో స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం జరుగుతుండగా పోలీసులు బట్ట బయలు చేశారు. ఒకప్పుడు వ్యభిచార గృహాలు ప్రత్యేకంగా నడిచేవి. ఎక్కడ వ్యభిచారం జరిగినా ఇరుగు పొరుగుకు ఇట్టే తెలిసి పోయేది. వారి సమాచారంతో పోలీసులకు ఇట్టే తెలిసి పోయేది.ఆ తర్వాత రైడింగ్ లు జరిగేవి. ఇప్పుడు వ్యభిచార నిర్వాహకులు రూటు మార్చారు. వ్యభిచారం అంటే అంతా ఆన్లైనే.. అసలు ఎక్కడ వ్యభిచారం జరుగుతుందో కనిపెట్టడం కాస్త కష్టమే. నిర్వాహకులు ఆన్ లైన్, సోషల్ మీడియా యాప్స్ ద్వారా విటులను గుర్తించి ఆకర్శిస్తారు. ప్యాకేజీలను బట్టి అమ్మాయిని ఎంపిక చేసుకోవచ్చు. అమ్మాయికి ఓకే చెప్పి పేమెంట్ చెల్లిస్తే అడ్రస్ ఇస్తారు. వ్యభిచార గృహాలు మాత్రం ఇళ్ల మధ్య నిర్వహిస్తున్నారు.బైట నుంచి చూడ్డానికి మామూలుగా ఉన్నా లోపలే అంతా తతంగం జరుగుతుంటుంది. తాజాగా విజయవాడలో స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచారాన్ని పోలీసులు బట్ట బయలు చేశారు. నిర్వాహకులు, యువతులు, విటులను అరెస్టు చేశారు.
విజయవాడలో కే9 బ్యూటీ స్పా. అందరికీ ఇది మసాజ్ సెంటర్ గానే తెలుసు. కానీ లోపల మాత్రం వివిధ రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పైకి ఇంద్ర భవనాన్ని తలపించే ఆ సెంటర్ ని చూస్తే ఎవరికీ రవ్వంత అనుమానం కూడా రాదు. అయితే ఆ భవనంలో వ్యభిచారం సాగుతున్నట్లు పోలీసులకు కొందరు సమాచారం ఇచ్చారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కే9 బ్యూటీ స్పా సెంటర్ పై దాడులు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, మిజోరాం, సిక్కిం, హైదరాబాద్ లకు చెందిన ఏడుగురు యువతులు పట్టుబడ్డారు. వ్యభిచార కేంద్రం నడుపుతున్న స్వీటీ అలియాస్ నందిని, కిరణ్ లను పోలీసులు అరెస్టు చేశారు.