మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం

Update: 2021-04-26 02:30 GMT
హైదరాబాద్ లో మరోసారి హైటెక్ వ్యభిచార దందా బయటపడింది. మసాజ్ సెంటర్ల ముసుగులో జరుగుతున్న బాగోతం బట్టబయలైంది. ఉత్తర భారత రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నారనే విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.

స్పెషల్ సర్వీసుల పేరిట యువకులకు వలవేస్తూ ఎలా దందా నిర్వహిస్తున్నారనే విషయం బయటపడింది. ఒక్కో సర్వీసుకు ఒఖ్కో రేటు ఫిక్స్ చేశారు. యువకులకు గాలం వేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారని తేలింది.

ఇంతటి కరోనా కల్లోలంలోనూ నిబంధనలు బేఖాతరు చేస్తూ విటులను ఆకర్షిస్తున్నారు. కరోనా కాలంలో భౌతిక దూరం పాటించాలి. కానీ అస్సలు పట్టించుకోకుండా మసాజ్ పేరుతో విటులను, అమ్మాయిలను తెచ్చి ఈ టైంలో గల్లీల్లో యథేచ్ఛగా ఈ దందా చేస్తున్నారు. అందమైన అమ్మాయిలతో ఈ వ్యభిచారం చేయిస్తున్నారు.

హైదరాబాద్ లోని కొత్తగూడ స్పా సెంటర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న సల్మాన్ అనే నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



Tags:    

Similar News