పండోరా పేపర్స్ లో : ప్రముఖ భారతీయ పారిశ్రామిక దిగ్గజాలు?

Update: 2021-10-05 15:30 GMT
వారంతా భారతీయులు.. కానీ విదేశాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కానీ దేశంలో మాత్రం దివాలా తీసినట్లు కనిపిస్తున్నారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద కుభేరుల జాబితాను ‘పండోరా పేపర్స్’ పేరిట ఇంటర్నేషనల్ కన్సర్టియా ఆప్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) బహిర్గతం చేసింది. ఇందులో భారతదేశానికి చెందిన ప్రముఖులు 300కు పైగా ఉన్నారు. అయితే వీరిలో ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలే ఎక్కువగా ఉండడం విశేషం. వీరిలో ప్రముఖంగా అనిల్ అంబానీ, మాజీ క్రీకెటర్ సచిన్, కళాకారుడు జాకీ ష్రాఫ్, లాబీయిస్టు నారారాడియా.. రాజీకీయ నాయకుడు సతశ్ శర్మ తదితరులు ఉన్నారు. అయితే పండోరా పేపర్స్ వీరి గురించి తెలపడంతో తాము అన్నీ చట్టబద్ధంగానే చేస్తున్నట్లు తెలుపుతున్నారు.

భారత్లో అంబానీ ఫ్యామిలీకి ఎంత పేరుంతో అందరికీ తెలిసింది. ఇందులో అనిల్ అంబానీ అప్పట్లో దివాలా తీసినట్లు ప్రకటించారు. తనకున్న 130 కోట్ల డాలర్లు ఆఫ్ షోర్ కంపెనీల గురించి ఇప్పటికీ ఎక్కడా చెప్లేదు. అయితే పండో పేపర్స్ ఆ విషయాన్ని బయటపెట్టింది. అసలు 2020లోనే లండన్ కోర్టు ఇలాంటి ఆఫ్ షోర్ కంపెనీల గురించి తెలిపింది. కానీ అనిల్ అంబానీ అలాంటివేమీ లేవని తెలిపాడు. అయితే ఇదే సంవత్సరం మేలో మూడు చైనా బ్యాంకులకు 716 డాలర్లు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా పండోరా పేపర్స్ అనిల్ అంబానీకి ఉన్న ఆస్తుల విలువలను బహరిర్గతం చేసింది. తనకు బ్రిటిష్ వర్ణిన్ ైలండ్స్ లో, జెర్సీ, సైఫ్ర్ స్ లలో మొత్తం 18 కంపెనీలు ఉన్నట్లు తెలిపింది. వీటన్నటింటి లావాదేవీలు దాదాపు రూ. 9945 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. వీటి ద్వారా పలు బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

క్రికెట్ దిగ్గజంగా పేర్కొంటున్న సచిన్ టెండూల్కర్ గురించీ పండోరా పేపర్స్ తెలిపింది. సచిన్ కు బ్రిటిష్ పర్ణిణ్ ఐలండ్స్ లో సాస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే కంపెనీ ఉండేది. అయితే 2016లో పనామా అనే పేపర్స్ లీకేజీ తరువాత ఆ కంపెనీని మూసేసినట్లు పండోరా పేపర్స్ తెలిపింది. ఈ కంపెనీకి సచిన్ భార్య అంజలి, ఆమె తండ్రి ఆనంద్ మోహతా డైరెక్టర్లుగా ఉన్నట్లు పండోరా పేపర్స్ తెలిపింది. ముగ్గురు కలిసి సాస్ ఇంటర్నేషనల్ లో రూ. 60 కోట్లు వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ పెట్టుబడుల గురించి సచిన్ తన పన్ను రిటర్న్స్ లో సమర్పించినిట్లు తెలిపారు.

ఇండియన్ కుభేరుల్లో ఒకరైన గౌతమ్ అదాని అన్న వినోద్ శాంతిలాల్ షా అదాని సైతం బ్రిటిష్ వర్ణిన్ ఐలండ్స్ లో 2018లో ‘హై బిస్కస్ ఆర్ ఈ హోల్డింగ్స్’అనే కంపెనీని స్థాపించాడు. సెప్రస్ జాతీయతను పొందిన వినోద్ ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నాడు. ఆ కంపెనికి సంబంధించిన 50 వేల షేర్లూ ఆయన పేరుమీదే ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఆస్తుల విలువ భారతీయ లెక్కల ప్రకారం 111 కోట్లు ఉంటుందని పండోరా పేపర్స్ తెలిపింది.

పండోరా పేపర్స్ మరో భారతీయుడు గురించి కూడా తెలిపింది. అయనే లాబీయిస్టు నీరారాడియా. యూపీఏ ప్రభుత్వం హయాంలో స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి పైరవీ చేశారు. అప్పట్లో ఆమె పలువురు రాజకీయ నాయకులు,పాత్రికేయులను ప్రభావితం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమెకు విదేశాల్లో రాక్స్ బరీ ఎస్టేట్స్ లిమయిటెడ్, ఎల్మాషే హోల్డింగ్స్ లిమిటెడ్ లాంటి 12 కంపెనీలు ఉన్నట్లు తెలిపింది. ఈమె పేరు పనామా పేపర్స్ లో కూడా కనిపించింది. ఇదిలా ఉండగా పండోరా పేపర్స్ కేసుకు సంబంధించిన దర్యాప్తును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చేపట్టనున్నట్లు బోర్డు చైర్మన్ తెలిపారు





Tags:    

Similar News