వైసీపీ కాదు..టీడీపీ నేత‌ల‌తోనే ఇబ్బందిః బాబు

Update: 2017-07-03 13:58 GMT
వైసీపీ వల్ల త‌మ‌కు ఎటువంటి ఇబ్బందులు లేవ‌ని, సొంత పార్టీ నాయకుల వల్లే కొన్ని ర‌కాల‌ ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయ‌ని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కొంద‌రు టీడీపీ  నాయకులు తమ వైఖ‌రిని మార్చుకోవాలని ఆయన సూచించారు.  అమరావతిలో సోమవారం నాడు జరిగిన పార్టీ సమన్వయకమిటీ సమావేశంలో ఆయ‌న‌ పలు అంశాలపై చర్చించారు.

నంద్యాల ప‌రిస్థితులు, ప్రభుత్వసంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు అవ‌స‌ర‌మైన కార్య‌క్ర‌మాల గురించి చ‌ర్చించారు. పార్టీ నియమావళికి విరుద్ధ‌గా వ్యవహరించే నేతలపై చర్యలపై చర్యలు తీసుకొంటామని బాబు హెచ్చరించారు. పార్టీపై, ప్రభుత్వంపై జరిగే వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన సమన్వయకమిటీ సమావేశంలో నేతలకు సూచించారు.

ఈ సమావేశంలో కొందరు పార్టీ నేతల తీరుపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరుతో వైసీపీకి మేలు జ‌రుగుతోంద‌న్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించి తీరాల్సిందేనని పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో 40 శాతం ప్రజలంతా టీడీపీ వైపు రావాల‌ని, వారంతా సంతృప్తితో ఉండాల‌ని బాబు అన్నారు. నెగెటివ్ వార్తలపై దృష్టిపెట్టాలని బాబు మంత్రులకు సూచించారు.

గుంటూరు జిల్లా నేతలపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అయ్యన్నపాత్రుడు నిర్వహించిన సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజర్ కావడంపై ఆయన మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని బాబు పార్టీ నాయకులను ఆదేశించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News