ఓడించిన చొటుకొచ్చి జగన్ పై విరుచుకుపడ్డ నారా లోకేష్

Update: 2021-02-11 15:30 GMT
చాలా రోజుల తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన గుంటూరు జిల్లా మంగళగిరికి వచ్చారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి తర్వాత లోకేష్ ఇటువైపు తిరిగి చూడలేదు. తాజాగా వచ్చి ఆలయాల సందర్శన, ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు.

అనంతరం పార్టీ నాయకులను ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలో అధికార వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఫోన్లు చేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని.. అధికార దుర్వినియోగం చేసిందంటూ నారా లోకేష్ ధ్వజమెత్తారు.

వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని చెప్పారు.ఇక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని నారా లోకేష్ తేల్చి చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని అన్నారు.

ఇప్పటికే తమ పార్టీ నాయకుడు పల్లా శ్రీనివాస్ విశాఖపట్నంలో దీక్షకు కూర్చున్నారని గుర్తు చేశారు. వందలాది మంది విశాఖపట్నం ప్రజలు ఆయనకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మున్ముందు మరింత ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
Tags:    

Similar News