మందలించాడని ముక్కలు చేసింది... ఓ భార్య కిరాతకం!

అవును... భర్త మందలించాడనే కారణంతో అతన్ని చంపి, ముక్కలు ముక్కలుగా చేసిన భార్య వ్యవహారం తాజాగా ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో జరిగింది.;

Update: 2025-12-23 06:30 GMT

మీరట్ లో జరిగిన "బ్లూ డ్రమ్" హత్య గురించి చాలా మందికి తెలిసిందే. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, అతని శరీర భాగాలను బ్లూ డ్రమ్ లో వేసి, పైన సిమెంట్ పోసిన పరిస్థితి! ఆ ఘోరానికి మించి అన్నట్లుగా తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన సంభాల్ కు చెందిన 38 ఏళ్ల రాహుల్ ను అతన్ని భార్య, ప్రియుడితో కలిసి ముక్కలు ముక్కలు చేసింది. తాజాగా ఆమె నిజం ఒప్పుకుంది. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... భర్త మందలించాడనే కారణంతో అతన్ని చంపి, ముక్కలు ముక్కలుగా చేసిన భార్య వ్యవహారం తాజాగా ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో జరిగింది. డిసెంబర్ 15న మురికి కాలువలో బాడీని గుర్తించగా.. దానికి తల లేకపోవడంతో అది ఎవరిది అనేది పోలీసులకు పెద్ద టాస్క్ గా మారిన పరిస్థితి. అయితే.. తాజాగా ఈ కేసు మిస్టరీ వీడింది.. భార్య చేసిన ఓ భయంకరమైన కుట్ర బహిర్గతమైంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... డిసెంబర్ 15 ఉదయం చందౌసీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పటారువా ఈద్గా వెనుక పొలాల దగ్గర ఓ పెద్ద నల్ల సంచి పడి ఉంది. దాని నుంచి దుర్వాసన చాలా బలంగా వస్తొంది. దీంతో అది గమనించిన ప్రజలు పోలీసులుకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో పాటు అక్కడికి చేరుకున్నారు. సంచి తెరిచి చూసే సరికి షాకయ్యారు.. ఇక ఆ వాసనకు ఊపిరి పీల్చుకోలేకపోయారు!

ఆ సంచి లోపల ఒక మానవ మొండెం ఉంది.. దానికి కాళ్లూ, చేతులతో పాటు తల కూడా లేదు. ఆ సమయంలో చర్మం పూర్తిగా పాడైపోయి, గుర్తించడానికి సాధ్యం కాని రీతిలో తయారైంది. దీంతో... ఇది ఎవరి శరీరంలో భాగం అనేది కీలక ప్రశ్నంగా మారింది. మరో వైపు.. రాహుల్ అనే టాటూ ఉన్న చేతిని పోలీసులు కనుగొన్నారు. ఈ సమయంలో ఈ పేరుపై ఏమైనా మిస్సింగ్ కేసు నమోదైందా అని చూశారు.

ఈ క్రమంలో షో అనూజ్ తోమర్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్లను తెరిచి, విచారణ ప్రారంభించారు. నవంబర్ 24 న తన భర్త కనిపించడం లేదని చున్నీ మొహల్లా నివాసి అయిన రూబీ ఫిర్యాదు చేసింది. షూ అమ్మకం దారుడు అయిన రాహుల్ కు భర్య (రూబీ) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సమయంలో పోలీసులు రూబీని స్టేషన్ కు పిలిపించారు. దొరికిన మొండాన్ని, టీషర్టును చూపించి ఇవి నీ భర్తవేనా అడిగారు.. కానీ, ఆమె కాదని చెప్పింది.

ఆమె చూపులో, మాటలో, ప్రవర్తనలో అనుమానం వచ్చిందో ఏమో కానీ.. పోలీసులు రూబీ మొబైల్ ఫోన్ ను సెర్చ్ చేశారు. ఆ ఫోన్ లోని గ్యాలరీలో కొన్ని ఫోటోలు కనిపించాయి. ఇందులో రాహుల్ అనే వ్యక్తి రూబీతో ఉన్నాడు. చిత్రంగా.. మృతదేహంపై ఉన్న టీ షర్టునే ధరించి ఉన్నాడు. దీంతో.. రూబీ అబద్దం చెబుతుందనే విషయం తొలిసారిగా పోలీసులకు అధికారికంగా కన్ ఫాం అయ్యింది. ఆ ఫోటో ఆమెకు చూపించినప్పుడు మౌనం ఆమెను ఆవరించింది.

హత్య జరిగిందిలా...!:

ఈ సమయంలో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో రూబీ ఆ భయంకరమైన విషయాలు ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించింది. ఈ ప్రకారం.. ఈ ఘటన నవంబర్ 17-18 రాత్రి జరిగింది. చున్నీ మొహల్లాలో రాహుల్ తన్న భార్య రూబీ, ఇద్దరు పిల్లలతో కలిసి నివసించాడు. అయితే.. రూబీ పొరుగున ఉన్న గౌరవ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో.. ఆ రోజు రాత్రి 11 గంటల ప్రాంతలో అతడిని ఇంటికి ఆహ్వానించింది.

దీంతో ఇద్దరూ ఆ ఇంట్లో ఉండగా.. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రాహుల్ ఇంటికి వచ్చాడు. తలుపు తెరిచిన వెంటనే ఓ దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన భార్య రూబీ, తన ప్రియుడితో అభ్యంతరకరమైన స్థితిలో ఉంది. దీంతో రాహుల్ కోపంతో ఆమెను మందలించాడు. ఈ సమయంలో ఇంట్లో పెద్ద గొడవ మొదలైంది.. ఆ క్షణంలో రూబీ ఒక ఇనుప రాడ్ తీసుకొని రాహుల్ తలపై బలంగా కొట్టింది. దీంతో.. రాహుల్ మరణించాడు.

ఈ సమయంలో మృతదేహాన్ని వెంటనే మాయం చేయాలని రూబీ, గౌరవ్ ఇద్దరూ భావించారు. ఈ క్రమంలో నవంబర్ 18న ఒక కట్టర్ తో రాహుల్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. మొదట తలను, తర్వా మిగిలిన అవయువాలను వేరు చేశారు. ఈ సమయంలో మార్కెట్ కు వెళ్లిన రూబీ రెండు పెద్ద నల్ల సంచులను కొనుక్కొచ్చింది. అందులో ఒక సంచిలో తల, కాళ్లు, చేతులు.. మరొక సంచిలో మోండెం ఉంచి ప్యాక్ చేసింది.

ఈ క్రమంలో మొదటి సంచిని సుమారు 50 కి.మీ. దూరంలో ఉన్న గంగా నదిపై ఉన్న రాజ్ ఘాట్ కు తీసుకెళ్లి నది మధ్యలో విసిరేయగా.. రెండో సంచిని చున్నీ మొహల్లా సమీపంలోని పత్రువా ఇద్గా వెనుక ఉన్న పొలాల్లో విసిరేశారు. దీంతో... ఈ మృతదేహాన్ని కనిపెట్టేటప్పటికి యుగాలు అవుతుందని వారు గ్రహించినట్లున్నారు. ఎందుకైనా మంచిదని భావించిందో ఏమో.. నవంబర్ 24న పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది.

విచారణ అనంతరం.. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం రూబి ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో మృతదేహాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించిన కటింగ్ మెషిన్ తో సహా అనేక కీలకమైన ఆధారాలు గుర్తించారు. ఈ క్రమంలో ఆమె ప్రియుడు గౌరవ్ ను కూడా అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News