మోడీ ముద్దు ప‌దం ఏమ‌యిందో ?

Update: 2022-03-19 01:30 GMT
ఒక‌రికి ఒక‌రు నిన్న‌టి దాకా..కానీ ఇప్పుడు ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారే!అంటే యోగి మాట మోడీ విన‌రు. మోడీ చెప్పిన విధంగాయోగి ఇక‌పై ప‌నిచేయ‌రు అని తేలిపోయింది. కాబోయే దేశ ప్ర‌ధానిగా యోగి పేరు వినిపించ‌డంలో త‌ప్పులేదు కానీ ఆ పేరు మోడీ క‌న్నా ప్ర‌బ‌ల రీతిలో వినిపించ‌క‌పోవ‌డ‌మే విచార‌క‌రం.

అందుకే గుజ‌రాత్ స్థానంలో యూపీ పేరు అభివృద్ధి విష‌య‌మై వినిపించ‌కున్నా శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో బ‌లీయంగా వినిపించేలా ఎన్ కౌంట‌ర్ ఆప‌రేష‌న్ల‌కు యోగి స‌న్నాహాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకునేందుకు ఆ విధంగా త‌న పేరు మార్మోగి పోయేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఇవి స‌త్ఫ‌లితాలు ఇస్తే మంచి రోజులు యోగికి ద‌క్క‌నున్నాయి. చెడ్డ‌రోజులు మోడికి మిగ‌ల‌నున్నాయి..అన్నది బీజేపీలోనే ఓ వ‌ర్గం పైకి చెప్ప‌ని మాట..లోప‌ల  
దాచుకుని సంబంధిత ప‌నుల‌ను మాత్రం త‌మ ద్వారా చేయించేందుకు ఉత్సాహ ప‌డుతున్న విధంగా చేయిస్తున్న మాట. క‌నుక ఆ త‌ర‌హా మాట నెగ్గితే యోగి నెగ్గుతాడు.సంబంధిత మాట ఓడితే మోడీ ఓడిపోతాడు.ఇంత చిన్న లాజిక్ ను బీజేపీకి ఎవ‌రు వివ‌రిస్తారో మ‌రి!

దేశ వ్యాప్తంగా గుజరాత్ మోడ‌ల్ తీసుకువ‌స్తామ‌ని  ఊద‌ర‌గొట్టారు న‌రేంద్ర మోడీ.కానీ ఆ విధంగా తాను అనుకున్న‌ది సాధించ‌లేక‌పోయారు.ముఖ్యంగా గ‌త కొద్ది రోజులుగా ఆ ముద్దు ప‌దం వినియోగం కూడా త‌గ్గిపోయింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

మోడీ క‌న్నాయోగీనే బెట‌ర్ అన్న వాద‌న ఒక‌టి మ‌ళ్లీ మ‌ళ్లీ వినిపించేందుకు బీజేపీలోనే ఇంకో వ‌ర్గం శత‌థా ప్ర‌య‌త్నిస్తోంది. అంటే గుజరాత్  మోడ‌ల్ అన్న ప‌దానికి కాలం చెల్లింద‌నే చెప్పాలి.అంటే ఆ రోజు జ‌రిగిన అభివృద్ధి క‌న్నా అంత‌ర్జాతీయ మీడియాల‌లో చెప్పుకున్న లేదా చేసుకున్న ప్ర‌చార‌మే ఎక్కువ అయిపోయింది అన్న‌ది కూడా తేలిపోయింది. ఈ ద‌శ‌లో మోడీకి భిన్నంగా సీన్ లోకి యోగి వ‌స్తున్నారు.రెండోసారి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక ఆయ‌న హ‌వా మ‌రింత పెరిగిపోనుంది.

అందుకు త‌గ్గ వాతావ‌ర‌ణం కూడా దేశ వ్యాప్తంగా యోగి సృష్టించ‌నున్నారు.ఇప్ప‌టివ‌ర‌కూ మోడీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న వ్యూహ క‌ర్త ప్రశాంత్ కిశోర్ కూడా మారిపోయి యోగి ద‌గ్గ‌రకు వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

ముఖ్యంగా సానుభూతి రాజ‌కీయాలు న‌డ‌ప‌డంలో,మత సంబంధ రాజ‌కీయాలు న‌డ‌ప‌డంలో దిట్ట‌గా పేరున్న ప్ర‌శాంత్ కిశోర్ ఇక‌పై యూపీ ఫ్యాక్ట‌ర్ ను ఫోక‌స్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వస‌రం లేదు.అంటే ఇక్క‌డ ఆడ‌బిడ్డ‌ల‌కు దేశంలో ఎక్క‌డా లేనంత ర‌క్ష‌ణ ఉంద‌ని,అదేవిధంగా రౌడీయిజం,గుండాయిజం అణిచివేసిన చ‌రిత్ర యోగిదేన‌ని ప్ర‌చారం చేసేందుకు సంబంధిత వ‌ర్గాలు సిద్ధం అయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

ఎలానూ రౌడీ మూక‌ల‌ను ఏరివేసేందుకు ఎన్ కౌంట‌ర్ ఆప‌రేష‌న్లు షురూ చేసినందున ఇక‌పై వాటిని కూడా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు వాడుకోనున్నారు.అంటే  సున్నిత ఉద్వేగాల‌ను త‌మ ఆలోచ‌ల‌న‌కు అనుసంధానించి రాజ‌కీయంగా ఎదిగేందుకు చేసే ప్ర‌తి ప్ర‌య‌త్నంలో యోగి ముందుండ‌నున్నారు.అందుకే బీజేపీలో ఓ వ‌ర్గం పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందించ‌నుంది.

వాస్త‌వానికి గుజరాత్ మోడ‌ల్ లో పెట్టుబడుల ఆక‌ర్ష‌ణ త‌ప్ప మాన‌వాభివృద్ధి ఏమీ లేద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట.అందుకే ప్ర‌ధాని మోడి ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్వేగ సంబంధ నిర్ణ‌యాల‌ను ప్రాచూర్యంలోకి తెస్తున్నారే త‌ప్ప గ‌తంలో తాను జ‌పించిన లేదా స్మ‌రించిన గుజ‌రాత్ మోడ‌ల్ ను ప్ర‌స్తావించేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు.
Tags:    

Similar News