రోజులు లెక్క పెట్టుకుంటున్నానన్నఒబామా

Update: 2016-05-01 09:30 GMT
నడవలేక.. సరిగా కూర్చోలేక.. ఆ మాటకు వస్తే సరిగా మాట్లాడలేక.. వందేళ్లకు దగ్గర పడుతున్న వేళ కూడా మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు డీఎంకే అధినేత కరుణానిధి ఎంతగా తహతహలాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. ఆయనే అంత ఆశగా ఉంటే.. ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికా అధ్యక్ష పదవిని రెండు టర్మ్ లు విజయవంతంగా పూర్తి చేసి.. మరికొద్ది రోజుల్లో పదవీకాలం ముగుస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఒబామా తన అధికారనివాసమైన వైట్ హౌస్ లో ఒక భారీ విందు ఏర్పాటు చేశారు. దీనికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల్ని ఆయన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన మీద తాను జోకులు వేసుకోవటమే కాదు.. విస్తుపోయే వ్యాఖ్యలు చేశారు. అమెరికా చట్టాల ప్రకారం ఏ రాజకీయ నేత కూడా రెండుసార్లకు మించి దేశాధ్యక్ష పదవిని చేపట్టకూడదు.

విందులో భాగంగా ఒబామా చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు మన రాజకీయ నాయకుల నోట్లో నుంచి ఈ తరహా వ్యాఖ్యలు అస్సలు ఊహించలేమనే చెప్పాలి. విందు సందర్భంగా తన మీద తాను జోకులు వేసుకుంటూ.. ఒబామా పని ఇక అయిపోయిందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి మరో అధ్యక్షులు ఇక్కడ ఉంటారని.. ఆమె ఎవరో మీరు ఊహించుకోవచ్చంటూ హిల్లరీ క్లింటన్ కాబోయే దేశాధ్యక్షురాలిగా చెప్పేశారు. తన గురించి చెప్పుకొస్తూ.. జుట్టు ఊడిపోయిందని.. వెంట్రుకలు తెల్లబడ్డాయని.. పదవి ఇప్పుడు ముగిసిపోతుందా? అని రోజులు లెక్కపెట్టుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఎనిమిదేళ్ల కిందట తానో యువనేతనని.. ఎంతో కసిగా ఉండేవాడినని.. ఇప్పుడు ముసలివాడినైపోయానంటూ వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News