అమరావతి కాదు వెలగపూడి అని అడగాలి
ఏడవాలో నవ్వాలో అర్థం కాని ఉదంతం ఇది. ఈ విషయం విన్నంతనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అభిమానించే వారికి ఆనందం అంతలోనే బాధ రెండు కలుగుతాయి. చివరకు ఈ ఉదంతం సీఎంకు తెలిసినా ఇలాంటి మిక్సెడ్ ఫీలింగ్ రావటం ఖాయం ఎందుకంటే.. తాను కలలు కనే రాజధాని అమరావతికి రావాల్సిన పేరు వచ్చినా.. ఆచరణలో మాత్రం వర్క్ వుట్ కాని తీరు బాధ కాక మరింకేంటి? ఇంతకీ.. ఇప్పుడు ఇదంతా ఎందుకు? అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. అసలేం జరిగిందంటే..
ప్రకాశం జిల్లాకు చెందిన రైతు ఒకరు ఏపీ సచివాలయానికి వెళ్లాలని బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ బస్టాండ్ లో ఆయన పంచారామాల్లో ఒకటైన "అమరావతి" బస్సు ఎక్కారు. టికెట్ కోసం వచ్చిన కండక్టర్ తో అమరావతికి టికెట్ కావాలంటూ వంద రూపాయిల నోటు ఇచ్చాడు. రూ.35 టికెట్ తీసుకొని మిగిలిన రూ.65 ఇచ్చాడు కండక్టర్.
అదేంటి అమరావతికి టికెట్ రూ.26 కదా? అని సదరు రైతు అడగటం.. కాదు అమరావతికి రూ.35 అని కండక్టర్ చెప్పారు. దీనికి రైతు సమాధానపడక.. మా ఊళ్లో అడిగే వచ్చాను. అమరావతికి రూ.26 టికెట్ చెప్పారన్నాడు. దీంతో.. కండక్టర్ కు సందేహం వచ్చి.. నువ్వు వెళ్లాల్సింది ఏ అమరావతికి? చంద్రబాబు అమరావతికా? అమరావతికా? అని ప్రశ్నించటంతో తాను సచివాలయానికి వెళ్లాలని చెప్పారు సదరు రైతు.
దీంతో కండక్టర్ స్పందిస్తూ.. అట్లయితే అడగాల్సింది అమరావతికి కాదు.. వెలగపూడికి అని చెప్పి.. అక్కడికైతే టికెట్ రూ.26 రూపాయిలే అంటూ ఇచ్చాడు. రాష్ట్ర రాజధాని అమరావతి అన్న మాట సామాన్య ప్రజల్లోకి బాగానే వెళ్లినా.. ప్రస్తుతం సచివాలయం ఉన్నది వెలగపూడిలో కావటం నిరాశ కలిగించేదే. మీరెప్పుడైనా ఏపీ సచివాలయానికి వెళ్లాలనుకుంటే మీరు అడగాల్సింది అమరావతి కాదు.. వెలగపూడి అన్నది మర్చిపోకండి.