మోడీ ఉదారతపై ప్రశంసల వెల్లువ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్ మొదట మా దేశంలో తయారైతే ఎవ్వరికి ఇవ్వమని అమెరికన్లకే వాడుకుంటామని అంటున్నారు. ఇక రష్యా కూడా వారి దేశస్థులకే మొదటి ప్రిఫర్ ఇచ్చింది. అయితే భారత్ లో కరోనా టీకా సిద్ధమైతే ప్రపంచదేశాలకు అందించేందుకు సిద్ధమని ప్రధాని మోడీ తాజాగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం సందర్భంగా హామీ ఇవ్వడం అందరిని మనసులను దోచుకుంది.
ఈ ప్రకటన చేసిన ప్రధాని మోడీపై తాజాగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈవో అదర్ పూనావాలా ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ ద్వారా స్పందించారు. మోడీ ప్రకటన భారత్ గర్వించదగ్గ సందర్భమని పూనావాలా అన్నారు. మోడీ నాయకత్వానికి.. మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పూనావాలా తెలిపారు. దేశం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు భారతీయుల అవసరాలు తీర్చగలవని.. దీంతో స్పష్టమవుతోందని అని అదర్ పూనావాలా వ్యాఖ్యానించారు.
వ్యాక్సిన్ కొనుగోలు చేసి పంపిణీ చేయడానికి ప్రభుత్వం నుంచి రూ.80వేల కోట్లు అవసరమవుతాయని వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఐక్యరాజ్యసమితిలో మోడీ ప్రసంగించడం ఆనందం కలిగించిందని పూనావాలా తెలిపారు.
కాగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యాక్సిన్ తయారీదారు ‘సీరమ్ ఇనిస్టిట్యూట్’ కావడం విశేషం. ఇప్పటికే సీరమ్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా టీకాను తయారు చేస్తోంది. 1 బిలియన్ డోసుల ఉత్పత్తికి సీరమ్ రెడీగా ఉంది.