పబ్ లో అశ్లీల నృత్యాలు .. 8 మంది మహిళలతో సహా 36 మంది అరెస్ట్ !

Update: 2021-02-08 14:36 GMT
నిబంధనలకు విరుద్ధంగా ఓ పబ్‌లో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న ఘటన తాజాగా హైదరాబాద్‌ లో వెలుగులోకి వచ్చింది.  హైదరాబాద్ బేగంపేటలోని ఓ పబ్ లో మహిళలతో అసభ్యనృత్యాలు చేయిస్తూ,అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడి లో  8 మంది మహిళలతోసహా 36 మందిని అరెస్ట్ చేశారు.

 నిబంధనలకు విరుధ్దంగా బేగంపేట కంట్రీక్లబ్ లో నిర్వహిస్తున్నలిస్బన్ బార్ అండ్ రెస్టారెంట్, పబ్ లో నిబంధనలకు విరుధ్దంగా మహిళలతో అసభ్యంగా నృత్యాలు చేయిస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందింది. దీంతో పంజాబ్‌గుట్ట ఎస్‌ఐ అరుణ్ కుమార్ నేతృత్వంలోని ఓ బృందం, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్‌తో కలిసి సంయుక్తంగా లిస్బన్ పబ్‌పై దాడి చేపట్టింది.

ఆ సమయంలో పబ్‌లో మహిళలు అశ్లీల నృత్యాలు చేయడం పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మొత్తం 28 మందిని అరెస్ట్ చేశారు. అందులో పబ్ సిబ్బందిపాటు, గెస్ట్‌లు కూడా ఉన్నారు. అలాగే 8 మంది మహిళలను రెస్క్యూ చేశారు.

దాడిలో 8 మంది మహిళలతో సహా 36 మందిని అదుపులోకి తీసుకున్నారు. 8మంది మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ దాడిలో ప్రధాన నిర్వాహకుడు మురళితో పాటు బంటి, వేణుగోపాల్, నందీశ్వర్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఈ పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని, బార్‌ అనుమతులు రద్దుచేయమని ఎక్సైజ్‌ అధికారులకు, పబ్‌ అనుమతిని రద్దు చేయాలని కలెక్టర్ ‌కు లేఖ రాస్తున్నట్లు పంజగుట్ట ఇన్ ‌స్పెక్టర్‌ నిరంజన్‌ రెడ్డి వివరించారు.
Tags:    

Similar News