శృంగార చెట్లు.. ఇవి ఏం చేస్తాయో చూస్తే షాక్

Update: 2020-01-13 05:19 GMT
ఈ భూమ్మీద ఎన్నో రకాల చెట్లు తమంత తాముగా పెరిగి పెద్దదవుతున్నాయి. మనిషి తన అవసరాల కోసం చెట్లను నరికి ఇప్పుడు ప్రకృతి బీభత్సానికి కారణమవుతున్నాడు.. మనిషికి, చెట్టుకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మానవ మనుగడకు చెట్లు జీవనాధారం.. చెట్టునుంచి వచ్చే పండ్లు, ఫలాలు, ఆకులతోనే మనిషి జీవితం ప్రారంభమైంది. మనిషి నుంచి ఏం ఆశించకుండా స్వయం ప్రతి పత్తి తో పెరిగే చెట్లు మనిషికి ఎన్నో ఇచ్చాయి.

దేశంలో చెట్ల సంఖ్య పడిపోతోంది. అడవులు తరగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే చెట్లను పెంచే హరితహారం లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విదేశాల్లో మాత్రం చెట్లను ప్రాణంగా చూసుకుంటారు. రోడ్డు వెడల్పులో భారీ చెట్లను తీసేయకుండా వాటి వేళ్లను కట్ చేసి వేరే చోట నాటుతారు.. అలాంటి టెక్నాలజీ ఇంకా దేశం లో రాలేదు..

అయితే చెట్లకు రూపాలుంటాయి.. కొన్ని చెట్లు ఏపుగా, గుబురుగా పెరిగితే.. మరికొన్ని వివిధ ఆకృతుల్లో కనువిందు చేస్తుంటాయి..  మానవ అవయావాలను తమలో ఇముడ్చుకున్న పలు చెట్లు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి.  యూరప్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సహా చాలా దేశాల్లో మానవుల అవయవాలను పోలిన ఈ చెట్లు పర్యాటకంగా అందరినీ అలరిస్తున్నాయి. ఈ శృంగార చెట్లు మనుషుల వలే కలగలసి పోయి సృష్టికార్యాన్ని గుర్తు చేస్తున్నాయి..
Tags:    

Similar News