55వేల కోట్లు ఇచ్చారు.. 5వేల మంది కూడా రాలేదంట.. ఏంది ఈ కథ?

Update: 2020-11-17 12:50 GMT
వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదంటే ఇదే కాబోలు.. వైఎస్ జగన్ సర్కార్ వేల కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టినా దాని ఫలితం రాలేదని తెలుస్తోంది. అటు పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు ఉపయోగం లేకుండా.. ఇటు లబ్ధిపొందిన ప్రజలు గుర్తుంచుకోని పరిస్థితి నెలకొందని వైసీపీ వర్గాలు వాపోతున్నాయట..

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలే ఓ సంచలనం. ఏకంగా 51శాతం ఓటింగ్ తో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకొని వైఎస్ జగన్ ప్రభంజనమే సృష్టించారు. ఏకపక్ష విజయాన్ని సాధించారు. టీడీపీని అడ్రస్ లేకుండా చేశాడు.

అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా జగన్ పాలనపై దృష్టిపెట్టారు. అప్పులు చేసి మరీ హామీలను నెరవేర్చారు. పార్టీకి సమయం సరిగా కేటాయించలేకపోయారన్న ఆవేదన కార్యకర్తలు, నేతల్లో ఉంది.  ఇక్కడ కొంచెం దెబ్బకొట్టిందని.. కార్యకర్తలు తమకు ఏం దక్కలేదని అడ్డం తిరిగారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిందంట..
 
ఏపీ సీఎం జగన్ మేనిఫెస్టో ప్రకారం అధికారంలోకి రాగానే ప్రజల కోసం దాదాపు రూ.55వేల కోట్ల సంక్షేమ పథకాలను ఖర్చు పెట్టారు. అలా సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తే ఓట్లు అన్ని మనకే పడుతాయని అనుకొని పార్టీలు, వర్గాలు, కులాలని చూడకుండా డైరెక్ట్ గా ఆన్ లైన్ ద్వారా  లబ్ధిదారులకు డబ్బులను  జగన్ సర్కార్ జమ చేసింది. కార్యకర్తలకు తెలియకుండానే ఈ పని అంతా జరిగిపోయింది.

అయితే ఈ వ్యవహారం వైసీపీ కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణమైందట.. గ్రామాల్లో గ్రామ నాయకులకు తెలియకుండా ఇదంతా జరగడంతో ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తున్న నాయకులు ఇలా డైరెక్ట్ పేమంట్స్ చేస్తే మా ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని బహిరంగంగానే  ప్రశ్నిస్తున్నారట.. దీనిపై సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు. ఇది వైసీపీలో బూమరాంగ్ అయ్యిందని అంటున్నారు.
 
దీని ఎఫెక్ట్ ఈ మధ్య సీఎం జగన్ చేసిన ‘ప్రజాసంకల్ప యాత్ర’పిలుపుపై పడిందంటున్నారు. పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కార్యకర్తల నిరుత్సాహం స్పష్టంగా కనిపడిందంటున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు, నియోజకవర్గంలో కార్యక్రమాలు పెడితే 10శాతం కూడా ఎవరూ హాజరు కాకపోవడంతో సక్సెస్ కాలేదంట.. మా డబ్బులు మాకు అకౌంట్లో పడుతున్నాయని.. మేము ఎందుకు రావాలని లబ్ధిదారులు ముఖం చాటేశారట.... ఇక కార్యకర్తలను అడిగితే ‘మా దగ్గర డబ్బులు లేవు.. మేము మనుషులను తీసుకోని రాలేము’ అని వాళ్లు కుండబద్దలు కొడుతున్నారట.. మరోవైపు హైకమాండ్ నుంచి ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతున్నారట.. ఎందుకంటే మీ నియోజకవర్గంలో పాదయాత్ర సరిగా జరగలేదని.. ఫోన్లు చేసి చంపుతున్నారట..

రాష్ట్రం మొత్తం మీద 55 వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఇస్తే కనీసం 5వేల మంది కూడా పాల్గొనలేదని.. వైసీపీ వర్గాలే అంటున్నాయంటే సంక్షేమ పథకాలకు ఓట్లు వచ్చే పరిస్థితి కాలం చెల్లిందని కూడా అంటున్నారు కొందరు మేధావులు.
Tags:    

Similar News