ఏపీపీఎస్సీ బోర్డు రద్దుకు పిల్ !

Update: 2022-06-19 07:31 GMT
ఏపీపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకాన్ని రద్దు చేయాలంటు ఒక లాయర్ తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.  ఛైర్మన్, సభ్యుల నియామకాలను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన చేపట్టిందో అర్ధం కావటం లేదని తన పిటిషన్లో చెప్పారు. నియమితులైన వారిలో ఎక్కువమంది అధికార వైసీపీకి చెందిన వారే ఉన్నారు కాబట్టి వెంటనే ఛైర్మన్, సభ్యుల నియామకాలను రద్దు చేయాలని తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పిటీషనర్ తన పిటీషన్లో పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించారు. అధికారణం 316 ప్రకారం పబ్లిక్ సర్వీసు కమీషన్లో  ఛైర్మన్, సభ్యుల నియామకాల్లో పలానా విధివిధానాలు అనుసరించాలని స్పష్టంగా లేదని పిటీషనరే పేర్కొన్నారు. అయినప్పటికీ నియమితులైనవారికి సమర్ధత, నైతికత ఉండాలని చెప్పటమే విచిత్రంగా ఉంది. నియమించినవారికి తగిన సామర్ధ్యముందా, అర్హులేనా అన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని సూచించారు.

నియామకాలకు సంబంధించి పలానా వాళ్ళనే నియమించాలనే రూల్ లేనపుడు ప్రభుత్వం ఎవరినైనా నియమిస్తుంది. మార్గదర్శకాలు లేనపుడు ఎవరిని నియమించినా తప్పు ఎలాగవుతుందో పిటీషనరే చెప్పాలి. ఏపీపీఎస్సీ అనేది రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని పిటీషనర్ తెగ బాధపడిపోయారు. అదిపుడు కాదు ఎప్పటినుండో పునరావస కేంద్రంగా మారిపోయిందని పిటీషనర్ మరచిపోయినట్లున్నారు.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఛైర్మన్ గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నియామకం ద్వారా ఏపీపీఎస్సీ హుందాతనం పెరుగుతుందని చెబుతూనే ఆయన్ను ఏ ప్రాతిపదికన నియమించారో చెప్పాలని అడగటం. సభ్యుడు విజయకుమార్ వివరాలు విద్యార్హతలు లేవట. ప్రొఫెసర్ పద్మరాజు గౌరవప్రదమైన విద్యార్హతలు కలిగున్నా ట్రాక్ రికార్డు పరిశీలించారో లేదో తెలీలేదట. మరో సభ్యుడు జీవీ సుధాకరరెడ్డికి డాక్టరేట్ ఉన్నా ఆయన వైసీపీకు సంబంధించినవారట.

ఇలాగే మిగిలిన సభ్యుల వివరాలు, ట్రాక్ రికార్డు, ప్రతిభను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం నియమించిందా లేదా అన్నది పిటీషనర్ క తెలీదట. అందుకనే అందరి నియామకాలను రద్దు చేయాలని కోరారు. చూస్తుంటే ఈ పిటీషన్ను రాజకీయ కారణాలతోనే వేసినట్లు అర్ధమైపోతోంది. మరి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News