గ్రేట్ ఛాన్స్ - బాబాయికి అబ్బాయి సాయం

Update: 2019-04-07 12:25 GMT
ముందే డిసైడ్ అయిన ష్కెడ్యూలు వల్ల బాబాయి పెట్టిన జనసేన తరఫున ప్రచారం చేయడానికి హీరో రాంచరణ్కి కుదరలేదని రాంచరణ్ అభిమానులు చెబుతూ వచ్చారు. లేదంటే బాబాయి కోసం రాంచరణ్ ఏమైనా చేస్తారని అనేవారు. ఏమైనా అనేది పక్కన పెడితే... అనుకోకుండా బాబాయికి సాయం చేసే అవకాశం రాంచరణ్కి దక్కింది. ఆర్ ఆర్ ఆర్ షూటింగులో కాలికి గాయం కావడంతో మూడు వారాలు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో చరణ్ కి తన మాట నెరవేర్చుకునే అవకాశం వచ్చింది.

ఇక ఎన్నికల ప్రచారానికి మిగిలి ఉన్నది రేపు ఎల్లుండే. ఎల్లుండి సాయంత్రం 5 గంటల తర్వాత ఇక ప్రచారానికి అవకాశం లేని నేపథ్యంలో ఈ రెండు రోజులు రాంచరణ్ ఎక్కడ ప్రచారం చేయనున్నాడన్నది ఆసక్తికరంగా ఉంది. ఇదిగో ఈ ఫొటో చూడండి. జనసేన కార్యాలయం వద్ద చరణ్ దిగిన ఫొటో వైరల్ అవుతోంది.




Tags:    

Similar News