సైన్యమే రాజ్యాంగం అంటున్న ముషారఫ్

Update: 2016-10-01 07:45 GMT
పాకిస్థాన్ ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రధానమైందా, ఆర్మీ అవసరమైందా? ఈ విషయాలపై తాజాగా స్పందించారు ఆదేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. తాను నమ్ముకున్న సిద్దాంతాన్ని ప్రజలకు సైతం ఉందని ఆపాదించే ప్రయత్నమో ఏమో కానీ... పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితులకు ప్రజాస్వామ్యం సరికాదని, అందుకే పాక్ వ్యవహారాల్లో ఆర్మీ కీలక పాత్ర పోషిస్తుందని పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య నేతలుగా - ప్రజాస్వామ్య పరిరక్షకులుగా చెప్పుకున్న ప్రభుత్వాలు సరిగా పనిచేయకపోవడం వల్లే పాక్ కు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పాలనలో ఆర్మీనే కీలకంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

తాజాగా వాషింగ్టన్ ఐడియాస్ ఫోరం ఇంటర్వ్యూలో మాట్లాడిన ముషారఫ్ దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ప్రజాస్వామ్యం లేదని, ఇది నేడు కొత్తగా వచ్చింది కాదని, ఇది పాకిస్థాన్ కు ఉన్న వారసత్వ బలహీనత అని ముషారఫ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ పాకిస్తాన్ ప్రజలు సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్య ప్రభుత్వాలని చెప్పుకునేవారివైపు కాకుండా సైన్యం వైపే చూస్తారని చెప్పిన ముషారఫ్... ఆ కారణంతోనే ప్రభుత్వ వ్యవహారాల్లో సైన్యం కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు.

ప్రజాస్వామ్యంపై తనకున్న అవగాహనను, సైనిక చర్యలపై ఆయనకున్న మక్కువనూ చెప్పకనే చెప్పిన ముషారఫ్... ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విఫలం కావడం వల్లే పాక్ లో ఈ పరిస్థితులు తలెత్తాయని ముషారఫ్ చెప్పుకొచ్చారు. పాక్ ఆర్మీతో తనకు సుమారు 40 ఏళ్ల అనుబంధం ఉందని.. తనవరకూ సైన్యమే రాజ్యాంగం అని ముషారఫ్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News