'పవనో'ద్యమం.. మళ్లీ లేటే సుమా..

Update: 2020-01-23 14:30 GMT
ఏపీ లో అమరావతి రైతుల ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. రోడ్డున పడి రైతులంతా నానా యాగీ చేస్తున్నారు. కానీ మన ‘పవనా’లు మాత్రం పింక్ సినిమా రిమేక్ లో బిజీగా ఉన్నారు. పొద్దున షూటింగ్.. సాయంత్రం అమరావతి వచ్చి ఓ పంచ్ డైలాగ్.. మళ్లీ పొద్దున షూటింగ్. ఇలా అమావాస్య చంద్రుడి వలే విరామాలు ఇస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు మన జనసేనాని పవన్ కళ్యాణ్. ఇప్పుడే కాదు.. పవన్ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగానే రాజకీయం చేస్తుంటారు. అదీ ఆయన స్టైల్..

పవన్ కళ్యాన్ వ్యవహార శైలియే పూర్తిగా డిఫెరెంట్. ఆయన నిర్ణయాలు, ఉద్యమాలు అన్నీ లేట్ గానే ఉంటాయి. సినిమాల షూటింగ్ కు లేట్ గా వచ్చినా ఆలస్యమైనా పెద్దగా నష్టం ఉండదు. కానీ ప్రజా ఉద్యమాలకు ఆలస్యంగా వస్తే మాత్రం రాజకీయంగా ఆ నేత భవిష్యత్తు కాలరాసుకున్నట్టే.. ఎన్నో అంశాల్లో పవన్ లేట్ గా స్పందించిన తీరు ఆయన రాజకీయ జీవితాన్ని మరింత తొక్కేసిందని రాజకీయ విశ్లేషకులు ఉదాహరణలు చెబుతున్నారు.

మొన్నటికి మొన్న ఏపీ లో వర్షాలు బాగా పడి ఇసుక కొరత వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువులు.. ఇలా అన్నింటిని ప్రతిపక్ష టీడీపీ టేకప్ చేసి నానా యాగీ చేసిన తర్వాత చావు కబురు చల్లాగా విన్నట్టు ఆలస్యంగా పవన్ స్పందించాడు.. ఉద్యమాలు చేశాడు. తాజాగా మళ్లీ అదే కథ..

దాదాపు 37 రోజులుగా అమరావతి కోసం ఫైట్ చేస్తున్న రాజధాని రైతుల కోసం పవన్ కళ్యాణ్ ఉద్యమం మొదలు పెట్టారు. అంటే ఇప్పుడే రోడ్డునపడి ఆందోళనలు చేస్తాడా అని కంగారు పడకండి. ఆయన ఉద్యమం చేస్తానన్నది ఫిబ్రవరి 2. మంచి ముహూర్తం చూసుకున్నారనుకుంటా.. అసెంబ్లీలో అంత యాగీ జరుగుతూ అమరావతి అంతా రగిలి పోతుంటే పవన్ మాత్రం ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా అంతా అయిపోయాక ఫిబ్రవరి 2న ఉద్యమం మొదలుపెడుతాడట.. విజయవాడ లో లాంగ్ మార్చ్ చేస్తాడట.. ఇలా ‘‘ఆలస్యం.. అమృతం ఓ పవన్’’ కళ్యాణ్ అని రాజకీయాల్లో సెటైర్లు కూడా పడుతున్నాయి. అయినా పవన్ స్టైల్ ఇదీ. అందుకే ఆయన ప్రజల్లో ఫేమ్ తెచ్చుకో లేక పోతున్నాడా అన్న ప్రశ్నను జనసేన లోని కింది స్థాయి నేతలే వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


Tags:    

Similar News