తెలంగాణపై కూడా పవన్ ఈక్వల్ ఫోకస్!
పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ తొలి అడుగులు వేసే విషయంలో అనుసరిస్తున్న వ్యూహం - నిర్వహిస్తున్న సభలు - చేపడుతున్న ప్రజా సమస్యలు ఇత్యాది అంశాలను బట్టి బేరీజు వేసే వాళ్లు ఎవరైనా సరే.. ఆయన తన పార్టీ ద్వారా ఏపీ రాజకీయాల మీద మాత్రమే ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నట్లుగా భావించే అవకాశం ఉంది. అయితే పవన్ తన పార్టీ విస్తరణ - సంస్థాగత నిర్మాణంలో వేస్తున్న తొలి అడుగు ద్వారా అలాంటి అభిప్రాయం తప్పు అని నిరూపించారు. ఎంపీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను ఎంపిక చేసిన వ్యవహారంలో ఏపీలాగానే తెలంగాణలో కూడా అన్ని నియోజకవర్గాలకు సమన్వయ కర్తల ఎంపిక చేశారు. తన పార్టీ దృష్టిలో రెండు రాష్ట్రాలకు ఈక్వల్ ఫోకస్ ఉంటున్నట్లుగా తేలుతోంది.
పవన్ కల్యాణ్ తాను జనసేన పార్టీని గత ఎన్నికల సమయంలోనే ప్రకటించినప్పటికీ.. ఇటీవల తిరుపతి సభ నుంచే బాగా యాక్టివేట్ అయ్యారు. తర్వాత మరి కొన్ని చోట్ల సభలు నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని సామాజిక సమస్యలను టేకప్ చేశారు. ప్రభుత్వంలో కదలిక తెచ్చారు. గోదావరి జిల్లాలో ఆక్వా పార్క్ దగ్గరి నుంచి - ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య వరకు ఆయన టేకప్ చేసిన వాటిలో ఉన్నాయి.
అయితే ఈ వ్యవహారాలు అంతా ఏపీ పరిధిలోనే జరుగుతున్నాయి. సీఎంతో మాట్లాడడం ప్రజల సమస్యల గురించి ప్రస్తావించడం వంటివన్నీ కూడా ఏపీలోనేజరుగుతున్నాయి. అయితే పవన్ కు తెలంగాణ ఫోకస్ ఉండదా అనే చర్చ మొదలైంది.
నిజానికి జీహెచ్ ఎంసీ ఎన్నికల సమయంలో జనసేన కొన్ని వార్డుల్లో అయినా పోటీచేస్తుందనే ప్రచారం బాగా జరిగింది. కానీ ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఆ ఎన్నికల్లో తెరాస ఢంకా బజాయించి గెలిచింది. పవన్ పార్టీ రంగంలో ఉంటే వారికి ఎంతో కొంత ప్రాతినిధ్యం దక్కి ఉండేదనే వాదనలు బలంగా వినిపించాయి. అయితే ఆ ఎన్నికల్లో దిగకపోయినంత మాత్రాన, సభలు పెట్టకపోయినంత మాత్రాన ఆయన తెలంగాణను విస్మరించినట్టు కాదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకు నిదర్శనంగానే రాష్ట్రవ్యాప్తంగా కేడర్ నిర్మాణం జరుగుతన్నదని కూడా చెబుతున్నారు. మరి ఏపీ- తెలంగాణల్లో ఎక్కడెక్కడ ఆయన సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో చూడాలి.