• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ ను నమ్మి చెడి.....

పవన్ ను నమ్మి చెడి.. పక్కదారి చూస్కున్నాడు

By - Tupaki Desk
Update: 2018-02-20 04:36 GMT
పీవీపీ గురించి తెలియనివారుండరు. భారీ చిత్రాల అగ్ర నిర్మాతగా టాలీవుడ్ మొత్తానికి చిరపరిచితులైన పీవీపీ.. క్రమంగా సినిమా నిర్మాణానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. పీవీపీ చాలా సీరియస్ రాజకీయ నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించాలని కూడా గట్టి ప్రయత్నం చేసి విఫలైన వ్యక్తి అని కొంతమందికి తెలుసు. వారు కూడా బహుశా మరచిపోయి ఉండొచ్చు. అంతగా ఆయన ఇటీవలి కాలంలో రాజకీయాల్ని పూర్తిగా పక్కన పెట్టేసి.. అచ్చంగా సినిమారంగంలోనే ఉండిపోయారు. తీరా ఇప్పుడు సినిమా రంగంలో దెబ్బ మీద దెబ్బ తిని పూర్తిగా కుదేలైన ఆయన ఈ రంగాన్ని వదిలేసి ఇక పూర్తిగా రాజకీయాలు మాత్రమే చేయాలనుకుని అటు అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రసాద్ వి.పొట్లూరి- పవన్ ను నమ్మి చెడిన వ్యక్తుల్లో ఒకరిగా కొన్ని పుకార్లున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాద్ వి.పొట్లూరి విజయవాడ పార్లమెంటు సీటునుంచి పోటీ చేయాలనుకున్నారు.  తెలుగుదేశం టిక్కెట్ కోసం ఆయన పవన్ ను ఆశ్రయించారు. అప్పట్లో తాను తెలుగుదేశానికి అనుకూల ప్రచారం చేస్తున్నాడు గనుక.. తన మాటకు విలువ ఇచ్చి ఆ మాత్రం ఒక ఎంపీ టికెట్ ఇవ్వకపోతారా అని పవన్ కూడా ప్రయత్నించారు గానీ.. విజయవాడ ఎంపీ సీటుకు అప్పటికే బీభత్సమైన పోటీ ఉన్న తెలుగుదేశంలో పవన్ పైరవీ పనిచేయలేదని ప్రచారం ఉంది. దీంతో పీవీపీ అనివార్యంగా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత కనీసం సినిమాల్లో అయినా పవన్ ద్వారా లాభపడాలని ఆయన అనుకున్నారు. గబ్బర్ సింగ్ 2 తర్వాత పీవీపీ బ్యానర్లో పవన్ చేసే సినిమా మొదలవుతుందని అంతా అనుకున్నారు. అప్పటికే బ్రహ్మోత్సవం దెబ్బకు కోలుకోలేని స్థితిలో పడ్డ పీవీపీ కనీసం పవన్ ద్వారా లాభాలు కళ్లజూడాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు ఎంత కాలానికీ పట్టాలెక్కలేదు. పవన్ ను నమ్మి ఆయన మళ్లీ భంగపడ్డాడు.

2014కు పూర్వం పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించడానికి సంబంధించి.. ప్రసాద్ వి.పొట్లూరి అన్ని రకాలుగానూ అండదండలు అందించారనే ప్రచారం ఉంది. అయితే ప్రస్తుతం సినిమాలు ఇక అక్కర్లేదని డిసైడయ్యాక ఆయన ఏపీలో రాజకీయాల్లోకి క్రియాశీలంగా ఎంట్రీ ఇస్తున్నారట. ఈసారి పవన్ జనసేన జోలికి వెళ్లడం లేదని.. ఏపీలోని రెండు పెద్ద పార్టీల్లో ఏదో ఒకదానిలో చేరే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
Tags:    
  • PVP 
  • Political Entry 
  • Andhra Politics 
  • Telugu NEWs 

Similar News

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

Copyright @2026

Powered by Blink CMS