• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీఎంని స్టాలిన్‌ చెప్పుతో...

సీఎంని స్టాలిన్‌ చెప్పుతో పోల్చిన డీఎంకే నేత.. సీఎం ఏమన్నారంటే?

By - Tupaki Desk
Update: 2021-03-27 08:30 GMT
మరి కొన్ని రోజుల్లోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్ని ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి పళనిస్వామిపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పళనిస్వామి.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాలికి వేసుకున్న చెప్పు పాటి విలువ కూడా చేయరుఅంటూ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఒకప్పుడు బెల్లం మార్కెట్‌‌లో కూలీగా పనిచేసి పళనిస్వామికి స్టాలిన్‌తో పోటీయా.. పళని కంటే స్టాలిన్ వేసుకునే చెప్పుకు విలువ ఎక్కువ.. అలాంటిది తనకు స్టాలిన్‌నే సవాల్ చేసే ధైర్యం ఉందా. నెహ్రూ, ఇందిరా గాంధీ, మోదీ సైతం చేయలేని సాహసం పళనిస్వామి చేస్తున్నాడంటే అందుకు కారణం డబ్బు. రాష్ట్రాన్ని లూటీ చేసిన తనను పార్టీని రక్షిస్తుందని భావిస్తున్నాడు. అటువంటి వ్యక్తి స్టాలిన్‌ను అడ్డుకుంటాను అంటున్నాడు. అదే జరిగితే సీఎం వాహనం తన నివాసం నుంచి కార్యాలయానికి వెళ్లదని నేను సవినయంగా మనవిజేస్తున్నాను అన్నాడు రాజా.

డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ఎడప్పాడి ప్రారంభించారు. తాను ఒక రైతు అని, ఒక పేద కుటుంబం నుంచి వచ్చానని, అందువల్ల వినయంగా ఉంటానని ప్రజల్లోకి దీనిని బలంగా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తాను ఒక రైతునని, పేద కుటుంబం నుంచి వచ్చానని, అందువల్ల వినయంగా ఉంటానంటూ ప్రజల్లో తన మీద సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని ప్రస్తావించిన సీఎం.. కంటికి కనిపించని గాలితో కూడా కుంభకోణాలు చేసిన ఏకైక పార్టీ డీఎంకే అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో మదురై జిల్లా మెలూర్‌లోని ఎన్నికల ప్రచారంలో పళనిస్వామి  మాట్లాడుతూ..నేను కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాను. కానీ స్టాలిన్ తండ్రి సీఎంగా ఉన్నందున ఆయన సిల్వర్ స్పూన్‌తో పుట్టారు. రాజా మాట్లాడిన భాష ఎలా ఉందో చూడండి.. నా విలువ స్టాలిన్ ధరించే చెప్పు కన్నా తక్కువని..  పొగరుగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో పోల్చి వారు ఎంతటి సంస్కారహీనులో నిరూపించుకున్నారు. నేను ఒక రైతును, మా పేదలు అలానే ఉంటారు.. మేము కష్టపడి పనిచేస్తాం.. మేం కొనుక్కోగలిగింది మాత్రమే కొనుగోలు చేస్తాం, కానీ వారు రూ. 1.76 లక్షల కోట్ల అవినీతి కుంభకోణం వెనుక ఉన్నారు. కాబట్టి కోరుకున్నది కొనుక్కుంటారు అని అన్నారు.
Tags:    
  • Yadaipadi Palani Swamy 
  • Tamilnadu Elections 
  • Tamil Nadu 
  • Telugu News 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS