నవాజ్ కు పాక్ సైన్యం తాజా వార్నింగ్..?

Update: 2016-10-16 09:23 GMT
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ టైం ఏమాత్రం బాగున్నట్లు లేదు. ఏం టచ్ చేసినా టైంబాంబ్ లెక్కన పేలిపోతున్న పరిస్థితి. కశ్మీర్ ఇష్యూలో వేలు పెట్టి కెలికి మరీ  భారత సైన్యం చేతిలో సర్జికల్ దాడుల షాక్ తిన్నారు. దీంతో.. నవాజ్ ఇమేజ్ దారుణంగా దెబ్బ తినటంతో పాటు.. దేశ ప్రజల నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన దుస్థితి. ఇది సరిపోదన్నట్లుగా పాక్ సైన్యం సైతం నవాజ్ సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉండటం.. తమ మాటల్ని లెక్క చేయని ఆయనపై కస్సుబుస్సులాడుతోంది.

అయితే.. ఈ సంచలన విషయాన్ని ఆ దేశ ప్రముఖ మీడియా సంస్థ డాన్ ప్రచురించటంతో నవాజ్ మరోసారి ఇరుకున పడ్డారు. పాక్ లాంటి దేశంలో మీడియా అంత స్వేచ్చగా.. సంచలన కథనాన్ని అచ్చేయటం ఏమిటంటూ ఫైర్ అయిన నవాజ్ వెంటనే ఆ కథనం రాసిన జర్నలిస్ట్ పై నిషేధం విధించారు. దీంతో.. ఆ దేశ మీడియా మొత్తం ఏకతాటి మీద నిలవటం.. ఒకట్రెండు మీడియా సంస్థలు ఆ వ్యతిరేకతను కవర్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన నవాజ్ సర్కారు.. జర్నలిస్టు మీద విధించిన బ్యాన్ ను ఎత్తేసింది.
Read more!

ఇదిలా ఉంటే.. ప్రభుత్వానికి.. సైన్యానికి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని.. ఆ విషయాన్ని ప్రభుత్వ వర్గాలే మీడియాకు లీక్ చేసినట్లుగా పాక్ సైన్యం నవాజ్ సర్కారు మీద ఫైర్ అవుతోంది. ఈ వ్యవహారం వెనుక ఉన్న వారెవరన్నది ఐదు రోజుల్లో తేల్చకపోతే.. ఆ విషయాన్ని తామే చూసుకుంటామంటూ నవాజ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తాము చెప్పిన సమయంలోపు ప్రభుత్వం కానీ బాధ్యుల్ని గుర్తించకుంటే. తామే స్వయంగా విచారించి ఈ ఇష్యూను తేలుస్తామన్న హెచ్చరిక నవాజ్ సర్కారుకు ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారింది. స్వల్ప వ్యవధిలో ఇంత సీరియస్ ఇష్యూ లెక్క తేల్చాలని సైన్యం నిక్కచ్చిగా చెప్పటంతో పాక్ ప్రధాని ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News