కేశినేని నాని ఎగ్గొట్టిన ట్యాక్సెంతో తెలుసా?

Update: 2017-03-27 11:03 GMT
టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నానిపై ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు.  కేశినేని నాని పెద్ద దొంగ అని... రూ. 9 కోట్ల సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించారు. నాని కారణంగా ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలన్నీ దెబ్బతిన్నాయని... చాలా మంది బస్సులు నడపడం కూడా ఆపేశారని అన్నారు.
    
నాని ఎంపీగా పోటీ చేస్తే ఆయన్ను గెలిపించడానికి తామంతా కృషి చేశామని.. కానీ.. ఆయన మాత్రం అందరినీ అణగదొక్కి తానొక్కడినే నిలవాలన్న ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు.  తనపై నాని కక్ష పెట్టుకున్నారని తెలిపారు. ఆయనలాంటి అహంకారి ఎంపీగా ఉండటం విజయవాడ ప్రజల దురదృష్టమని చెప్పారు. తానే గొప్పవాడినని, మిగతావాళ్లంతా వేస్ట్ అనే విధంగా నాని ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
    
 అన్ని రకాల సరైన అనుమతులతోనే తాము బస్సులు నడుపుతున్నామని... అందుకే తమ బస్సులను ఆయన టార్గెట్ చేశారని... తమ మూడు బస్సులపై అక్రమంగా కేసులు నమోదు చేయించారని అన్నారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చాలా మంచి వ్యక్తి అని... అలాంటి వారి వల్లే తాము బస్సులు నడపగలుగుతున్నామని చెప్పారు. మొత్తానికి ట్రావెల్స్ వ్యాపారాన్ని శాసిస్తున్న టీడీపీ ఎంపీలు ఆ రంగంలో మిగతావారిని పూర్తిగా జీరో చేయడానికి పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News