హైదరాబాద్ లో ఆన్ లైన్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్ లో ఆన్ లైన్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. సెక్స్ రాకెట్ నిర్వహాకులను రాచకొండ పోలీసులు అదుపులో తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతున్న వీరి వ్యభిచార కూపంలో కోల్ కతాకు చెందిన నలుగురు అమ్మాయిలు ఇరుక్కోగా వారికి విముక్తి కల్పించారు పోలీసులు. పశ్చిమ బెంగాల్ నుంచి కొందరు యువతులను అక్రమంగా తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్న వ్యక్తిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ ఫైల్ చేశారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర ప్రాంతానికి చెందిన వంశీరెడ్డి అలియాస్ కృష్ణారెడ్డికి కొంతకాలం క్రితం వ్యభిచార నిర్వాహకురాలు అంజలితో పరిచయమైంది. సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న వంశీరెడ్డి ఆమె ముఠాలో సభ్యుడిగా చేరాడు. ఉద్యోగం పేరుతో పశ్చిమ బెంగాల్ నుంచి అందమైన అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు.
ఆన్ లైన్లో అమ్మాయిల ఫోటోలను పోస్ట్ చేసి విటులను ఆకర్షించేవాడు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యభిచార నిర్వాహకులతో మాట్లాడి అక్కడి నుంచి అమ్మాయిలను హైదరాబాద్ కు తీసుకువచ్చేవారు. తరువాత వారిని అద్దె ఇంట్లో ఉంచి ఆన్ లైన్లో వారి ఫోటోలను షేర్ చేసేవారు. ఎవరైనా సంప్రదిస్తే వారి గురించి ఆరాతీసి సేఫ్ అనిపిస్తే అప్పుడు వారి దగ్గర కొంత డబ్బు అడ్వాన్స్ గా తీసుకుని ముందే అనుకున్న సమయానికి అమ్మాయిలను అక్కడికి పంపేవారు. ఈ వ్యవహారం మొత్తం ఆన్ లైన్ లోనే సాగిపోయేది. దీనిపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీసుల కొద్దిరోజుల క్రితం వీరి స్థావరంపై దాడి చేసి అమ్మాయిలను రక్షించారు. వంశీరెడ్డితో పాటు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతుల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించిన వంశీరెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశించారు. దీంతో పోలీసులు అతడిపై అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.