మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా ఒదలని ‘ఒమిక్రాన్’ వైరస్

Update: 2021-12-18 10:34 GMT
మూడు డోసులు వేసుకున్నా కరోనా కొత్త రకం వైరస్ ‘ఒమిక్రాన్’ వదిలిపెట్టడం లేదు. ఈనెల 9న 29 ఏళ్ల ఓ వ్యక్తి న్యూయార్క్ నుంచి ముంబై వచ్చాడు. విమానాశ్రయంలో అతడికి కరోనా పరీక్ష నిర్వహించగా ఆయనకు పాజిటివ్ వచ్చింది. అయితే అతడు ఫైజర్ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నాడని.. అయినా అతడికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు.

అతడికి ఒమిక్రాన్ వైరస్ అని తేలిందని చెప్పారు. అయితే అతడిలో ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. ఒమిక్రాన్ మూడు డోసులు వేసుకున్నా కూడా వస్తుందని అర్థమవుతోంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.

ఒమిక్రాన్ సోకిన వ్యక్తితో కాంటాక్ట్ లో ఉన్న ఇద్దరికీ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చినట్లు తెలిపింది. కాగా మహారాష్ట్రలో 40కిపైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

కరోనా మహమ్మారిని మళ్లీ సోకకుండా టీకాలు నిలువరించలేవని ఇదివరకే నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. ఇదిప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ విషయంలోనూ నిజమైంది. టీకా వేసుకున్నా రీఇన్ఫెక్షన్ అవుతాయని.. అయితే దాని తీవ్రత స్వల్పంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తెలిపారు.

దీన్ని బట్టి ఒమిక్రాన్ వైరస్ తీవ్రత ఎక్కువని.. అది ఇప్పట్లో మనల్ని విడిచిపెట్టదని అర్థమవుతోంది. ఫైజర్ సైంటిస్ట్ చెప్పినట్టు ఈ వైరస్ 2024 వరకూ మనతోనే ఉండేలా కనిపిస్తోంది. మరో మూడేళ్లు ఈ మహమ్మారిని ప్రపంచం భరించకతప్పదని తెలుస్తోంది.




Tags:    

Similar News