• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నోట్ల ర‌ద్దు,...

నోట్ల ర‌ద్దు, వ్య‌భిచారంపై చ‌ర్చ ఒక‌టే

By - Tupaki Desk
Update: 2016-12-19 05:25 GMT
ఆర్థికశాస్త్రంలో నోబుల్ బహుమతి గ్రహీతలైన  ఓలివర్ హార్ట్ - బెంగ్ట్ హాల్మ్‌స్ట్రామ్ భార‌త‌దేశ ప్ర‌భుత్వం తీసుకున్న రూ.500 - రూ.1000 నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెద్దనోట్లను రద్దుచేస్తూ భారత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సమర్థించలేమ‌ని అన్నారు. నల్లధనాన్ని రూపుమాపేందుకు ఇది సరైన ప్రత్యామ్నాయం మాత్రం కాదని విశ్లేషించారు. ఇంకా క‌చ్చితంగా చెప్పాలంటే నల్లధనం.. వ్యభిచారంపై చర్చ రెండూ ఒకటేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ్యభిచారాన్ని కొన్ని సమాజాలు అంగీకరించలేవు, కానీ, దానిని న్యాయబద్ధం చేస్తే అందులో పనిచేస్తున్న మహిళలకు చట్టభద్రత లభిస్తుంది అని ఆర్థికశాస్త్రంలో నోబుల్ బహుమతి గ్రహీతలైన  ఓలివర్ హార్ట్ - బెంగ్ట్ హాల్మ్‌స్ట్రామ్ విశ్లేషించారు.

ఇదిలాఉండ‌గా పెద్దనోట్ల రద్దు నిర్ణ‌యాన్ని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు మ‌ళ్లీ ప్ర‌శంసించారు. కృష్ణాజిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ప్రధాని నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడినా దీర్ఘకాలంలో దేశానికి ప్రయోజనం చేకూరుతుందని వెంక‌య్య నాయుడు జోస్యం చెప్పారు. నోట్ల రద్దుతో అవినీతి - నల్లధనం నివారణ సాధ్యమని అన్నారు. నగదు రహిత లావాదేవీల సాధనే ప్రభుత్వ లక్ష్యమని - దీనికి అన్ని రాష్ట్రాలు సహకరించాలని వెంక‌య్య నాయుడు విజ్ఞప్తి చేశారు. అందరికీ బ్యాంకు ఖాతాలు సాధ్యమా? అని గతంలో తనకు సందేహం ఉండేదని, అయితే మోడీ దాన్ని పటాపంచలు చేశారని అన్నారు. పెట్రోల్ బంకుల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు జరుగుతున్న చర్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆరాతీశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Oliver Hart and Bengt holmstrom 
  • Demonetisation 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS