బాబు మీద ఆగ్రహం.. చికాగోలోనూ జనాగ్రహ దీక్ష

Update: 2021-10-27 04:28 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేయం.. దీని పై రెచ్చిపోయిన వైసీపీ సానుభూతిపరులు.. జగన్ అభిమానులు పట్టాభి ఇంటి మీదా.. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీదా దాడి కి పాల్పడటం తెలిసిందే. దాడి కి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేయగా.. దీని కి కౌంటర్ గా ఏపీ అధికారపక్షం జనా గ్రహ దీక్ష పేరు తో రివర్సులో దీక్ష చేయటం తెలిసిందే.

ఈ వాడివేడి రాజకీయాలు ఏపీని దాటేసి.. సముద్రాల తర్వాత ఉండే అమెరికా కు పాకేసింది. తాజాగా చికాగో మహానగరం లోని ఏపీకి చెందిన పలువురు ఎన్నారైలు.. జనా గ్రహ దీక్షను నిర్వహించారు. పార్టీకి చెందిన ఎన్నారై నేత సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ నేతలు రక రకాల పద్దతుల్లో ఏపీ పరువును గంగలో కలుపుతున్నారంటూ మండిపడ్డారు.

ఏపీ ఇమేజ్ ను అంతర్జా తీయంగా డ్యామేజ్ చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తం గా ఏపీ గంజాయి రాష్ట్రం గా ముద్ర వేసే ప్రయత్నం ఢిల్లీ వేదిక గా మొదలు పెట్టారని దుయ్యబట్టారు. పట్టాభి తో సీఎం జగన్ ను బూతులు తిట్టించటం.. తర్వాత జరిగిన పరిణామాల్ని ఒక ఉద్యమం మాదిరి మార్చటం.. దాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని తప్పు పట్టారు. సీఎం జగన్ కు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బోసిడీ కే అన్న పదం తో సీఎం జగన్ ను దూషించిన టీడీపీ నేత పట్టాభిని తెలుగుజాతి క్షమించదన్న వారి తీరు చూస్తే.. ఏపీ రాజకీయం అమెరికా వరకు వ్యాపించిందన్న భావన కలగటం ఖాయం.
Tags:    

Similar News