పని చేయడమే వారి తప్పా మోదీ?
రెండోసారి ప్రధాని పీఠంపై కూర్చున్న నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్న నేతలు, పరిగణనలోకి తీసుకోని విషయంలో ఆసక్తికర లెక్కలు బయటకొచ్చాయి. దేశమంతా ప్రతికూల పవనాలు వీస్తున్నాయంటూ ఎన్నికల ముందు అంతటా నెగటివ్ ప్రచారం జరిగినప్పటి గతం కంటే ఎక్కువ స్థానాలు సాధించిన బీజేపీ విజయంలో కొందరు నేతలు కీలక పాత్ర పోషించారు. బీజేపీకి పెద్దగా పట్టు లేని రాష్ట్రాల్లోనూ మంచి ఫలితాలు సాధించారు. అదేసమయంలో ఇంకొందరు నేతలు తమకు అప్పగించిన రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. కానీ.. జీరో ఫలితాలు సాధించిన నేతలకూ మంత్రి పదవులు దక్కగా.. అద్భుత ఫలితాల సాధనలో కీలక పాత్ర పోషించినవారికి మాత్రం మంత్రివర్గంలో చోటు దక్కలేదు.
ముఖ్యంగా పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, కర్ణాటకల్లో మంచి ఫలితాలు సాధించడం వెనుక ఉన్న నేతలకు మోదీ మంత్రివర్గంలో చోటు దొరకలేదు. అదే సమయంలో ఒక్క సీటూ సాధించలేకపోయిన ఏపీకి ఇంచార్జిగా ఉన్న నేతకు మంత్రి పదవి ఇచ్చారు.
టాపర్లకు మొండిచేయి...
వినయ్ సహస్రబుద్ధి:
సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారం కోల్పోయింది. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం అక్కడ రెండు మినహా మిగతా అన్ని లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అలాంటి ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన నేత బీజేపీ వైస్ ప్రెసిడెంట్ వినయ్ సహస్రబుద్ధి. కానీ, ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు.
కైలాశ్ విజయవర్గీయ:
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అత్యంత బలంగా ఉంది అని అంతా అనుకుంటున్న వేళ ఆ రాష్ట్రంలో బీజేపీ 19 ఎంపీ సీట్లు గెలుచుకుని మమతబెనర్జీకి నిద్రలేకుండా చేసింది. ఈ విజయం వెనుక ఉన్నది కైలాశ్ విజయవర్గీయ. ఆయనకూ మోదీ కేబినెట్లో సీటు దొరకలేదు.
రాం మాధవ్:
ఇక నార్త్‌ఈస్ట్‌లో బీజేపీ జెండా ఎగరేసిన తెలుగు నేత, వ్యూహకర్త రాంమాధవ్ కూడా మంత్రి పదవి అందుకోలేకపోయారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర... ఇలా ఈశాన్యాన కాషాయ జెండా ఎగరవేయడంలో కీలకంగా మారిన తెలుగోడు మంత్రి పదవి దరిదాపులకు కూడా వెళ్లలేకపోయాడు.
మురళీధరరావు:
మరో తెలుగు నేత మురళీధరరావుదీ అదే పరిస్థితి. కర్ణాటక ఇంఛార్జిగా ఉన్న ఈ తెలంగాణ నేత అక్కడ బీజేపీ 25 సీట్లు సాధించడంలో అంతా తానే అయ్యారు. కానీ, మంత్రి పదవి మాత్రం ఆయన్ను వరించలేదు.
భూపేంద్ర యాదవ్:
గుజరాత్‌కు ఇంచార్జిగా ఉన్న భూపేంద్రయాదవ్‌కూ మంత్రి పదవి దొరకలేదు. గుజరాత్‌లో అన్ని సీట్లూ బీజేపీ కైవసం చేసుకోవడంలో భూపేంద్ర యాదవ్‌దే కీలక పాత్ర. అయితే.. భూపేంద్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు వినిపిస్తోంది.
లూజర్లకు అందలం...
వి.మురళీధరన్:
మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా సాధించని అతి కొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల బాధ్యతలు చేపట్టిన బీజేపీ ఇంచార్జి పేరు వి.మురళీధరన్. ఆయనకు మోదీ మంత్రివర్గంలో పదవి దొరికింది. ఇప్పుడాయన విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి.
ప్రహ్లాద్ జోషి:
మణిపూర్ రాష్ట్రానికి బీజేపీ ఇంచార్జి ప్రహ్లాద్ జోషి. ఆ చిన్న రాష్ట్రంలోని రెండు సీట్లలో ఒక్కటే బీజేపీ గెలిచింది. ఇంకోటి ఓడిపోయింది. కానీ, జోషి మాత్రం మోదీ మంత్రివర్గంలో బొగ్గు, గనుల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ మంత్రిగా చాన్సు కొట్టేశారు.