క్రిస్మస్ రోజున దారుణం.. చూస్తుండగానే 20 మంది సజీవ దహనం

బస్పు ప్రమాదాలు ఆగడం లేదు. మృత్యువు బస్సులోని వారిని కబళిస్తూనే ఉంది.;

Update: 2025-12-25 05:29 GMT

బస్పు ప్రమాదాలు ఆగడం లేదు. మృత్యువు బస్సులోని వారిని కబళిస్తూనే ఉంది. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కర్ణాటకలో చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో కనీసం 9 నుంచి 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

ప్రమాదం ఎలా జరిగింది?

బెంగళూరు నుంచి ‘గోకర్ణ’ వెళుతున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, హిరీయుర్ సమీపంలో కంటెయినర్ లారీతో ఢీకొట్టుకుంది. అతివేగంగా వచ్చిన లారీ డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున కావడంతో చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉండడంతో బయటపడే అవకాశం లేకుండా వెనుకభాగంలోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అయితే ముందు భాగంలో ఉన్న కొంతమంది ప్రయాణికులు తలుపులు పగులకొట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు.

సహాయక చర్యలు

సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చిత్రదుర్గ, హిరియూరు, తుమకూరు, సిరా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రమాదం నుంచి సురక్షింతంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.

వరుస రోడ్డు ప్రమాదాలతో ఆందోళన

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులో కూడా వరుసగా ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం తమిళనాడులోని జరిగిన మరో ప్రమాదంలో ప్రభుత్వ బస్సు రెండుకార్లను ఢీకొనడంతో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే..

భద్రతపై దృష్టి అవసరం

అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ , భద్రతా ప్రమానాల లోపం వంటి కారణాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికుల భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని.. ముఖ్యంగా ప్రైవేట్ బస్సులపై కఠిన పర్యవేక్షణ అవసరమని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తోణమే సహాయం అందించాలని గాయపడిన వారికి మెరుగైన చికిత్స కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News