ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ పంచాయతీ షురూ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారని తెలిసింది.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారని తెలిసింది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ సహా.. ఆ పార్టీ అగ్రనేత.. సోనియా గాంధీతో పాటు.. ఇతర నేతలను కూడా ఆయన కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వ్యవహారంపై రేవంత్ రెడ్డి వారితో చర్చించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే పలువురు నాయకుల పేర్లను కూడా సిద్ధం చేశారు.
రెండు స్థానాలకు ఎమ్మెల్సీలను ఎంపిక చేయాల్సి ఉంది. గత బీఆర్ ఎస్ హయాం నుంచి కూడా ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు.. వివిధ కారణాలతో భర్తీ కాకుండా నిలిచిపోయాయి. ఇటీవల సు ప్రీంకోర్టు ఈ నియామకాలకు పచ్చ జెండా ఊపడంతో రెండు స్థానాలను భర్తీ చేసేందుకు సర్కారుకు అవ కాశం చిక్కింది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. ప్రభుత్వ పక్షమే .. ఈ రెండు స్థానాలను కూడా దక్కించుకో నుంది. ప్రస్తుతం ముగ్గురి పేర్లతో సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ అధిష్టానాన్ని కలుసుకుంటారు.
వీరిలో పార్టీ అగ్రనే తలు సూచించిన వారికి ఈ పదవులను ఇవ్వనున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో ఇప్పటికే మంత్రి పదవిని చేపట్టిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా ప్రముఖ ఉర్దూ పత్రిక ఎడిటర్ అమీర్, తెలంగాణ ఉద్యమ నాయకుడు.. ప్రొఫెసర్ కోదండ రామ్‌ల పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చారు. వీరిలో పార్టీ ఎంపిక చేసిన వారిని సిఫారసు చేస్తూ.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపనున్నారు.
అదేవిధంగానిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంపైనా సీఎం రేవంత్ రెడ్డి పక్కా క్లారిటీతో ఉన్నారు. దీనికి కూడా అభ్యర్థిని ఖరారు చేయడంపై పార్టీ అగ్రనేతలతో సీఎం చర్చించ నున్నారు. బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత ఈ స్థానం నుంచి గతంలో విజయం దక్కించుకు న్నారు. ఇటీవల ఆమె చేసిన రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించారు. దీంతో ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది.