జగన్ అన్ని పథకాలు చేసినా.. `పాజిటివ్ ఫీడ్ బ్యాక్` రావడం లేదా?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. అమ్మ ఒడి సహా.. పింఛన్లు.. చేయూత.. ఇలా.. అనేక రూపాల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రజలకు పథకాలను చేరువ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నా.. ఆయన వెరవకుండా.. అప్పులు చేసి తెచ్చిన సొమ్మును కూడా పథకాలకు మళ్లించారు.
ఒకవైపు ప్రతిపక్షాల నుంచివిమర్శలు వస్తున్నా.. ఇక, అప్పులు ఇవ్వలేం మహాప్రభో అంటూ.. బ్యాంకులు చేతులు ఎత్తేసినా.. మరోవైపు..కేంద్రం కూడా రుణ పరిమితిని పెంచేది లేదని..ఎప్పటికప్పుడు .. అంటున్నా.. సీఎం జగన్ లెక్కచేయలేదు.
వారిని బ్రతిమాలో.. బామాలో.. ఆయా పథకాలకు నిధులు మళ్లిస్తున్నారు. అంతేకాదు.. ఉద్యోగులు తమకు పీఆర్సీ పెంచాలని డిమాండ్ చేసి ఉద్యమించిన సమయంలోనూ.. పథకాలు నిలిచిపోతాయని.. అంత మొత్తం మీకు ఇవ్వలేనని.. సీఎం జగన్ తెగేసి చెప్పారు.
తాను ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగించి తీరుతానని ఆయన ఇటీవల మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు.. అప్పలు చేసిన సొమ్ముతోనూ ఆయన అభివృద్ధి చేయకుండా.. కేవేలం సంక్షేమం పేరుతో ప్రజలకు ఇచ్చేస్తున్నారు.
అయితే.. ఇంత చేస్తున్నా.. జగన్‌కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం లేదనే గుసగుస వినిపిస్తోంది. రాజకీయ మేధావులు చెబుతున్న విషయాలను పరిశీలిస్తే.. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఇస్తున్న సొమ్ముల విషయం .. కేవలం ఎమ్మెల్యే, ఎంపీలకు, మంత్రులకు మాత్రమే తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో వలంటీర్లకు మాత్రమే తెలుస్తోంది.
అంతకుమించి.. పార్టీలో కీలక నేతలకు కానీ.. కేడర్‌కు కానీ తెలియడం లేదు. దీంతో వారు క్షేత్రస్థాయిలో ఎవరికి ఏ పథకం అందుతోంది? అనే విషయాన్ని తెలుసుకోలేక పోతున్నారు. ఇది పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారింది.
నిజానికి ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పుడు.. క్షేత్రస్థాయిలో కేడర్‌కు సమాచారం ఇస్తే.. వారు ప్రచారం చేస్తారు. దీనివల్ల పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. కానీ.. ఇలా చేయకపోవడంతో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం లేదని అంటున్నారు. మరోవైపు పథకాలు తీసుకున్నవారు కూడా సైలెంట్‌గానే ఉంటున్నారు.
పథకాలు తీసుకోననివారు.. అనర్హులు మాత్రం.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ప్రబుత్వానికి సెగ తప్పడం లేదు. మరో వైపు.. లోకల్ లీడర్లు కూడా.. తమకు కనీసం సమాచారం ఇవ్వరా? అని ఆగ్రహంతో ఉన్నారు.
తమను వాడుకుని వదిలేశారని.. బహిరంగంగానే విమర్శలు సంధిస్తున్నారు. ఇక, గ్రామాల్లో అయితే.. ఈ విషయం.. రచ్చబండల దగ్గర పెద్ద చర్చగా మారింది. ఎన్ని పథకాలు అమలు చేస్తే మాత్రం ఏంటి.. కనీసం.. రోడ్డు కూడా వేయరా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు.. ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని.. కనీసం.. పాత ప్రాజెక్టును కూడా పూర్తి చేయడం లేదని..వారు అంటున్నారు. దీంతో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ బదులుగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుండడం పై.. మేధావులు సైతం..ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.