• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పోలవరం ఎత్తులో ఎటువంటి...

పోలవరం ఎత్తులో ఎటువంటి మార్పుల్లేవు.. పీపీఏ కీలక వ్యాఖ్యలు

By - Tupaki Desk
Update: 2020-12-01 11:30 GMT
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొద్ది  రోజులుగా ప్రతిపక్ష టీడీపీ   ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  అయితే పోలవరం నిర్మాణంలో ఎటువంటి మార్పులు లేవని ప్రాజెక్టు అథారిటీ సభ్యులు తాజాగా తేల్చిచెప్పారు.  కొద్ది రోజులుగా టీడీపీ  అగ్రనాయకులు తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని ఆందోళనలు  నిర్వహిస్తున్నారు. దీనిపై రోజు ఒక వివాదం నడుస్తోంది. అయితే ఈ విషయంలో మంత్రులు  టీడీపీ  నాయకుల విమర్శలకు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. పోలవరం ఎత్తు ఒక్క సెంటీమీటర్ కూడా తగ్గించడంలేదని చెబుతూ వచ్చారు. ఈ విషయమై అధికార ప్రతిపక్ష నేతల మధ్య వార్  కొనసాగుతుండగానే ఇవాళ పోలవరం అథారిటీ  ప్రతినిధులు పోలవరం నిర్మాణ పనులను పరిశీలించారు. రెండు రోజులపాటు ప్రతినిధుల బృందం పోలవరం పనులను పరిశీలించనుంది.

ఇందులో భాగంగా ప్రాజెక్టు సంబంధించిన కీలక అంశాలపై వారు నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తారు.తొలిరోజు పర్యటనలో పీపీఏ సభ్యులు పోలవరం నిర్మాణ పనులను పరిశీలించి ప్రాజెక్టు ఎత్తు ఈ విషయంలో ఎటువంటి మార్పులు, చేర్పులు లేవని నిర్ధారించారు. గతంలో ఎంత ఎత్తుకు నిర్మాణం మొదలుపెట్టారో అంతే ఎత్తుతో పనులు జరుగుతున్నట్టు తేల్చారు. తొలి డీపీఆర్ ఆధారంగానే పనులు జరుగుతున్నట్టు నిర్ధారించారు.

 ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు పై వస్తున్న వార్తలకు సంబంధించి ప్రాజెక్టు అథారిటీ సీఈ ఏకే ప్రధాన్ మాట్లాడారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించ లేదని చెప్పారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గింపు ఎవరి వల్లా  కాదని, ఇది సాధ్యం అయ్యే పని కూడా కాదని తేల్చారు. ప్రాజెక్టు సంబంధించిన 76% కాంక్రీట్, హెడ్ వర్క్స్ పనులు పూర్తి అయినట్లు చెప్పారు. పునరావాసం,  ఇతర పనులు కలిపి 41శాతం పూర్తయినట్లు చెప్పారు. పనులు జరుగుతున్న తీరునుబట్టి అనుకున్న సమయానికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ను సందర్శించిన వారిలో పీపీఏ సభ్యులు మోహన్(డీఏ), అమిత్ సింగ్ (సీఈ -పవర్ సెక్టార్), పోలవరం ఎస్ ఈ నాగిరెడ్డి, డీఈలు  బాలకృష్ణ రామేశ్వరం నాయుడు, ఈఈ ఆదిరెడ్డి, మెగా ఇంజినీరింగ్ సంస్థ జీఎం సతీష్ బాబు, అంగర మిశ్రా ఉన్నారు.
Tags:    
  • Polavaram Project 
  • Polavaram Project Details 
  • Polavaram Project Rapire Phase 
  • Polavaram Project Details 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS