నిజాం ఆస్తి మాది మాకివ్వండి

Update: 2021-01-14 11:30 GMT
స్వాతంత్య్రానికి పూర్వం భారత్ లో సంపన్న సంస్థానంగా ‘హైదరాబాద్’ ఉండేది. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలోని కొన్ని ప్రాంతాలు కలిసి ఇప్పుడు తెలంగాణ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరం నుంచి పాలన సాగేది. ఈ క్రమంలోనే అప్పుడు ప్రజలను పీడించుకొని భారీగా సంపద పోగేసుకున్నాడు నిజాం రాజు.

స్వాతంత్య్రం  వచ్చాక ఈ ఆస్తులన్నీ కొల్లగొట్టుకొని పోగా.. కొన్ని మాత్రం అలానే మిగిలిపోయాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నిజాం జ్యువెల్లరీ ట్రస్ట్ ఆస్తి వివాదం వేగంగా పరిష్కరించాలని కేంద్రాన్ని నిజాం కుటుంబ వారసులు కోరుతున్నారు.

గత 26 ఏళ్లుగా ఇది పెండింగ్ లో ఉందని నిజాం మనవడు నజఫ్ అలీఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల్లో చాలా మంది మరణించారని.. తమ ఆరోగ్య, ఆర్థిక సమస్యల దృష్ట్యా వేగంగా వివాదం పరిష్కరించాలని కోరుతున్నారు.

హైదరాబాద్ సంస్థానం విలీనం సమయంలో ఈ ఆస్తి వివాదం అపరిష్కృతంగా మిగిలిపోయింది. గత 26 ఏళ్లుగా ఇది పెండింగ్ లోనే ఉంది.
Tags:    

Similar News