‘పంచాయితీ’ రద్దుపై వెనక్కితగ్గని నిమ్మగడ్డ..

Update: 2021-01-11 14:26 GMT
ఏపీలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై వెనక్కి తగ్గకూడదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయించారు. దీన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేయాలని నిర్ణయించారు. దీనిపై డివిజన్ బెంచ్ లో పిటీషన్ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డ తరుఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా ఏపీలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు రద్దు చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తున్నట్లుగా ఆదేశాలు వెలువరించింది. వ్యాక్సినేషన్ కు ఆటంకం కలుగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అయితే నిమ్మగడ్డ వాదనను సింగిల్ బెంచ్ పట్టించుకోకపోవడంతో నిమ్మగడ్డ అసంతృప్తిగా ఉన్నారు. డివిజన్ బెంచ్ లో దీన్ని సవాల్ చేయాలని నిర్ణయించారు. ఈరోజు హైకోర్టు సమయం ముగిసినా హౌస్ మోషన్ పిటీషన్ రూపంలో డివిజన్ బెంచ్ లో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసేందుకు నిమ్మగడ్డ తరుఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.

ఇవాళ పిటిషన్‌ దాఖలైనా రేపు లేదా ఎల్లుండి మాత్రమే దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంటుంది. హైకోర్టు అత్యవసరమని భావిస్తే రేపు విచారణ జరిపే అవకాశం కూడా ఉంటుంది.

ఇవాళ ఆన్‌లైన్‌ విధానంలో సింగిల్‌ బెంచ్‌ పంచాయతీ ఎన్నికల పిటిషన్‌ విచారించగా.. నిమ్మగడ్డ పిటిషన్‌నూ ఇదే విధానంలో విచారించే అవకాశం ఉంది.
Tags:    

Similar News