నిమ్మగడ్డకు మాత్రమే రక్షణ కావాలా?

Update: 2021-01-24 05:30 GMT
స్టేట్ ఎలక్షన్  కమీషనర్ నిమ్మగడ్డ వ్యవహారశైలి చాలా విచిత్రంగా ఉంది. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ టీకాలు వేయించుకున్న తర్వాత తాము ఎన్నికల విధుల్లో పాల్గొంటామని చీఫ్ సెక్రటరీ దగ్గర నుండి ఉద్యోగుల సంఘాల నేతలవరకు పదే పదే మొత్తుకుంటున్నా పట్టించుకోవటం లేదు. కరోనా వైరస్ సమస్య తగ్గిపోయింది కాబట్టి తాను ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు బదులిస్తున్నారు. ఇదే నిజమైతే శనివారం ఉదయం తన కార్యాలయంలో పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవటం విచిత్రంగా ఉంది.

తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నిమ్మగడ్డ తన టేబుల్ కు మూడు వైపుల పెద్ద గ్లాస్ చాంబర్ ఏర్పాటు చేసుకున్నారు. మీడియాను దూరంగా కూర్చోబెట్టారు. మైకులు పెట్టటానికి గ్లాస్ చాంబర్ మధ్యలో సన్నని గ్యాప్ వదిలిపెట్టారు. జారీ అయిన నోటిఫికేషన్ను కూడా మీడియా సమావేశం తర్వాత ఆయన నేరుగా మీడియా ప్రతినిధుల చేతికి అందివ్వలేదు. తన సిబ్బంది ద్వారా పంపిణీ చేయించారు.

మీడియా వాళ్ళు ఆయన కార్యాలయంలోకి ప్రవేశించేముందే అందరికీ శానిటైజర్లను చల్లారు. మీడియా మిత్రులు కూర్చునే కుర్చీల్లో ముందుగానే శానిటైజర్లను స్ప్రింకిల్ చేశారు. మామూలుగా మీడియాతో మాట్లాడేటపుడు మైక్ వాడరు. కానీ నిమ్మగడ్డ మాత్రం మైక్ ద్వారా మాట్లాడారు. ఎందుకంటే మీడియా వాళ్ళని దూరంగా కూర్చోబెట్టారు కాబట్టి వినటానికి వీలుగా మైక్ వాడారు.

అంటే తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశానికి ఇన్నిజాగ్రత్తలు ఎందుకు తీసుకున్నట్లు ? కేవలం కరోనా వైరస్ భయంతోనే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇవే జాగ్రత్తలు వేలాది పోలింగ్ స్టేషన్లలో తీసుకోవట ప్రభుత్వానికి సాధ్యమేనా ? ఎన్నికల విధుల్లో బాధ్యతలు నిర్వర్తించాల్సిన దాదాపు లక్షమంది ఉద్యోగులు, కోట్లాదిమంది ఓటర్లకు జాగ్రత్తలు తీసుకోవటం సాధ్యంకాదని అందరికీ తెలిసిందే.

ఇందుకనే కనీసం డ్యూటీలో పాల్గొనే ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయ్యేవారకైనా ఎన్నికలను వాయిదా వేయాలని అడుగుతున్నది. కానీ అందుకు నిమ్మగడ్డ ఒప్పుకోవటం లేదు. ఈ కారణంగానే నిమ్మగడ్డపై జనాలందరు మండిపోతున్నారు. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.
Tags:    

Similar News