వాన్స్ దంపతులకు నాలుగో బిడ్డ.. యూఎస్ చరిత్రలో ఇదో రికార్డ్!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ దంపతులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.;

Update: 2026-01-21 09:41 GMT

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ దంపతులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగా... త్వరలోనే నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో... జులై చివరిలో పండంటి మగబిడ్డ తమ జీవితాల్లోకి రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఇన్‌ స్టాగ్రామ్ పోస్ట్‌ లో తెలిపారు. జెడి - ఉషా వాన్స్ ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు కాగా.. వారు ఎవాన్, వివేక్, మిరాబెల్!




 


అవును... 41 ఏళ్ల వాన్స్, 40 ఏళ్ల ఉషా మరోసారి తల్లితండ్రులు కాబోతున్నారు. ఇందులో భాగంగా... వీరిద్దరూ ఈ ఏడాది జూలై చివర్లో తమ నాలుగో బిడ్డను జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా... తమకు మద్దతు ఇస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో... తాజా ప్రకటన నేపథ్యంలో మద్దతుదారులు, సన్నిహితులు వాన్స్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదే సమయంలో... ప్రభుత్వ కార్యాలయం, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ తమకు లభించిన మద్దతును ఈ జంట ప్రశంసించారు. ఇందులో భాగంగా... ఈ ఉత్తేజకరమైన, రద్దీ సమయంలో, తమ కుటుంబాన్ని అద్భుతంగా చూసుకునే సైనిక వైద్యులకు.. తమ పిల్లలతో అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ దేశానికి సేవ చేయగలమని నిర్ధారించుకోవడానికి ఎంతో కృషి చేసే సిబ్బందికి తాము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రకటన పేర్కొంది.

వాస్తవానికి పదవిలో ఉన్నప్పుడు 1963లో నాటి ప్రథమ మహిళ జాక్వెలిన్ కెన్నెడీ తమ మూడవ సంతానం పాట్రిక్ బౌవియార్ కెనడీకి జన్మనివ్వగా... అంతకముందు 1893లో నాటి ప్రథమ మహిళ ఫ్రాన్సిన్స్ క్లీవ్ ల్యాండ్ తన కుమార్తె ఎస్తేర్ కు జన్మనిచ్చింది. ఇలా పదవిలో ఉన్నప్పుడు మొదటి మహిళ బిడ్డకు జన్మనివ్వడం రెండు సార్లు జరిగింది కానీ... రెండో మహిళ విషయంలో జరగడం మాత్రం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారని అంటున్నారు!

కాగా... జెడి వాన్స్, ఉషా వాన్స్ యేల్ లా స్కూల్‌ లో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. ఈ క్రమంలో 2014లో వివాహం చేసుకున్నారు. సెకండ్ లేడీ కావడానికి ముందు ఉషా వాన్స్.. ముంగర్, టోల్స్ & ఓల్సన్ ఎల్.ఎల్.పీలో పనిచేస్తూ.. ఫెడరల్ అప్పీల్ కోర్టులో జాన్ రాబర్ట్స్ & బ్రెట్ కవనాగ్‌ లకు క్లర్కుగా పనిచేస్తూ విశిష్టమైన న్యాయవాద వృత్తిని నిర్మించుకున్నారు.

Tags:    

Similar News